Kiwi Fruits For Weight Loss, Diabetes: కివీ పండ్లు శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. దీనిని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. అయితే ఈ పండ్ల ధరల విషయానికొస్తే..అన్ని ఫ్రూట్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ అన్ని పండ్లకంటే ఎక్కువగా ఫలితాలను ఇస్తుంది. రోగ్య నిరోధక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని కూడా దృఢంగా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కివీలో లభించే పోషకాలు:
కివీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. అయితే ఇందులో ఉండే పోషకాలు బాడీని ఫిట్‌నెస్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ పండ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి.
కివీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>గుండె జబ్బులు ఉన్నవారు తరచుగా కివీని తినడం చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
>>అధిక రక్తపోటు సమస్యలను కూడా సులభంగా నియంత్రిస్తుంది. దీంతో బీపీని అదుపులో అదుపులో ఉంటుంది.
>> ఇందులో క్యాలరీల పరిమాణాలు చాలా తక్కువ కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గుతాయి.
>>కివి తినడం వల్ల శరీర టాక్సిన్స్ కూడా తగ్గుతాయి. చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది.
>>కివీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మంపై అద్భుతమైన గ్లో వస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి.
>>పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
>>ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.
>>కివిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా రకాలుగా మేలు చేస్తాయి.
>>ఎముకల సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా తొలగిపోతాయి.
>>మానసిక సమస్యలతో బాధపడేవారు..తప్పకుండా వీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook