Mushroom Benefits: వామ్మో... పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Benefits of Mushroom: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పుట్టగొడుగులు ఒకటి. మష్రూమ్స్ తినడం వల్ల బాడీకి ఎన్న రకాల పోషకాలు అందుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2023, 05:45 PM IST
Mushroom Benefits: వామ్మో... పుట్టగొడుగులు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?

Mushroom Benefits: పుట్టగొడుగులు..శరీరానికి ఎన్నో పోషకాలను అందించడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి. ఇందులో ఎన్నో రకాలు పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మష్రూమ్స్ ను ఎక్కువగా కూర వండుకుంటారు. మష్రూమ్స్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. 

పుట్టగొడుగుల ప్రయోజనాలు
** బరువు తగ్గాలనుకునేవారు పుట్టగొడుగలను డైట్ లో చేర్చుకోండి. వీటిని తీసుకుంటే కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. 
** పుట్టగొడుగులు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా మీరు చురుగ్గా ఆలోచించగలుగుతారు. 
** పుట్టగొడుగుల​లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా సహాయపడుతుంది. 

Also Read: Cardamom Tea Benefits: ఏలకుల టీని తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

** మష్రూమ్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని తీసుకోవడంలో మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
** మష్రూమ్స్ లో యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. 
** పుట్టగొడుగులలో ఎర్గోథియోనిన్ మరియు గ్లుటాతియోన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల మీకు అంతగా వృద్ధాప్యం రాదు. 
** పుట్టగొడుగులు గ్లుటామేట్ రిబోన్యూక్లియోటైడ్‌లను కలిగి ఉంటుంది. ఇది హార్ట్ ఎటాక్స్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. 
** మష్రూమ్స్ లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలు బలపేతం చేయడంలో సహాయపడుతుంది. 

Also Read: Benefits of Ginger Water: అల్లం నీరుతో అద్భుత ప్రయోజనాలు.. ఒకసారి ట్రై చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News