Best Health Habits: కొన్ని రకాల అలవాట్లు మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం లేదా బలహీనపర్చడం జరుగుతుంటుంది. రోజూ భోజనం చేసిన తరువాత మీకు ఆ అలవాటుంటే మాత్రం మీరు ఫిట్ ఉంటారు. దీనివెనుక శాస్త్రీయమైన కారణమేంటో తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలి కారణంగా వచ్చే మార్పులతో ఫిట్నెస్ సమస్యగా మారుతోంది. అందుకే ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత కాస్సేపు లైట్‌వాక్ అనేది చాలా అవసరం. సాధారణంగా ఇంట్లో వృద్ధులు భోజనం చేసిన తరువాత కాస్సేపు నడవడమే కాకుండా..ఇంట్లో కుటుంబసభ్యుల్ని అలా చేయమని సూచిస్తుంటారు. అయితే చాలామంది ఇది పాటించరు. మెరుగైన ఆరోగ్యం కావాలంటే..వెంటనే విశ్రాంతి తీసుకోవడం మానేయాలి. కాస్సేపు లైట్‌వాక్ చేస్తేనే ఫలితముంటుంది.
చాలా మంది ఆరోగ్య నిపుణులు కూడా భోజనం తరువాత లైట్‌వాక్ చేయమనే చెబుతుంటారు. వాస్తవానికి భోజనం తరువాత వాకింగ్ లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే కచ్చితంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. భోజనం తరువాత లైట్ వాక్ అలవాటు చేసుకుంటే ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే కాకుండా..మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలుంటే దూరమౌతాయి. భోజనం తరువాత లైట్‌వాక్ కారణంగా..బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఫలితంగా డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరమవుతుంది.
తిన్న వెంటనే విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ రిఫ్లెక్స్ పెరిగిపోతుంది. దాంతో ఎసిడిటీ, తేన్పుల సమస్యలు ఎక్కువౌతాయి. భోజనం తరువాత గంటల తరబడి వాకింగ్ అవసరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం పది నిమిషాల సేపు లైట్ వాక్ చేస్తే చాలంటున్నారు.
Also read: Potato Benefits: బంగాళదుంపతో స్థూలకాయానికి చెక్, ఆశ్చర్యంగా ఉన్నా..నిజమే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook