Male Fertility: పురుషుల్లో ఆ స్టామినా పెరగాలంటే.. ఈ చట్నీని తినాల్సిందే..!

Married Men's Fertility: వివాహం తర్వాత పురుషులకు సంతానోత్పత్తి సమస్య ఉంటే.. చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే ఇంటి నివారణల ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 05:02 PM IST
Male Fertility: పురుషుల్లో ఆ స్టామినా పెరగాలంటే.. ఈ చట్నీని తినాల్సిందే..!

How to Increase Men's Stamina: పెళ్లి చేసుకోవడం ప్రతి మగాడి కల. వివాహం తర్వాత శరీరంలో ఏదైనా బలహీనత వస్తే..భాగస్వామి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యను మీ ఇంటిలో ఉండే హోం రెమిడీస్ ద్వారా అధిగమించవచ్చు. దీంతో  మీ లైంగిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. 

పెళ్లైన పురుషులు ఈ 2 వస్తువులను తినాలి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంతాన సమస్యలు ఉన్న పురుషులు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినాలి. మీ సామర్థ్యం (Men's Stamina) పెరగాలంటే ఈ రెండింటిన చట్నీ చేసుకుని ప్రతిరోజూ తినాలి. ఇలా చేయడం ద్వారా మీ లైంగిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. 

ఉల్లిపాయ-వెల్లుల్లి చట్నీకి కావలసినవి: 1 పెద్ద ఉల్లిపాయ, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చి మిరపకాయలు, సగం టీస్పూన్ నల్ల ఉప్పు, 2 చిన్న టమోటాలు, నిమ్మరసం, సగం టీస్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ కాల్చిన జీలకర్ర, రుచికి తెలుపు ఉప్పు.

ఉల్లిపాయ-వెల్లుల్లి చట్నీ ఎలా తయారు చేయాలి?
ముందుగా నూనెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టొమాటోలను తేలికగా వేయించాలి. దీని తర్వాత మిగతావన్నీ మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. దానిని బయటకు దీసి..సరిపడా ఉప్పు కలపండి. దీంతో చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు దానిని ఆహారంతో సర్వ్ చేయండి.

స్టామినా పెరగాలంటే...
ఉల్లిపాయల (onions) వినియోగం పురుషుల సంతానోత్పత్తికి (Male Fertility)ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్ను పెంచుతుంది. అదేవిధంగా మీ స్టామినాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మరోవైపు, మనం వెల్లుల్లి (Garlic) గురించి మాట్లాడినట్లయితే, ఇందులో ఉండే అల్లిసిన్ సమ్మేళనం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది, ఇది నపుంసకత్వ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీనితో పాటు స్పెర్మ్ కౌంట్ (Sperm count) కూడా పెరుగుతుంది.

Also Read: Face Beauty Tips: వంకాయతో ముఖంపై మెుటిమలకు చెక్ పెట్టండిలా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News