Morning Bad Habits: ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చేసే కొన్ని చెడు అలవాట్లను మానుకోవాలని తరచూ మన ఇంట్లోని పెద్దలు సూచిస్తుంటారు. అలా చేయడం వల్ల రోజంతా ప్రతికూలతలు ఎదురవుతుంటాయని చెబుతుంటారు. అలా పెద్దలు సూచించిన తర్వాత కొన్నిసార్లు వాళ్లకు తెలియకుండా ఆ అలవాట్లను కొనసాగిస్తుంటారు. నిద్రలేవగానే మొబైల్ యూజ్ చేయడం, స్నానం చేయకపోవడం, చిన్న చిన్న పనులను వాయిదా వంటి వాటిని చేస్తుంటారు. దీని వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని మీకు తెలుసా? వాటి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే మొబైల్ యూజ్ చేయవద్దు
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత చాలా మందికి కొన్ని చెడు అలవాట్లు మానుకోలేకపోతుంటారు. అలాంటి వాటిలో మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ఒకటి. దాని వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. వాటి వల్ల జీవితంలో ప్రతికూలతలు ఏర్పడడం సహా.. సోమరితనం ఏర్పడుతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వేడి నీటిని తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
స్నానం చేయని వారికి ఇబ్బందులే!
ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని.. కచ్చితంగా స్నానం చేయాలి. అలా చేయడం వల్ల రోజంతా మీరు ఉల్లాసంగా గడుపుతారు. కానీ, చాలా మంది సోమరితనంతో స్నానం చేయడాన్ని వాయిదా వేస్తారు. ఇలా ఉండడం వల్ల వారికి రోజంతా చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే మీ శరీరంపై చెమటతో ఉన్నప్పుడు మీరు ఏ పనిని సులభంగా పూర్తి చేయలేరు.
బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయకండి
ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా వస్తుంది. దీని వల్ల చాలా మందిలో ఆకలి ఉండదు. దీంతో వారు ఉదయాన్నే అల్పాహారాన్ని మానేస్తుంటారు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే నిద్ర లేచి.. మొదట కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే.. స్నానం చేసి అల్పహారం తినాలి. అలా చేయడం వల్ల మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: Omicron Symptoms: ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో రెండు కొత్త ప్రాణాంతక లక్షణాలు?
Also Read: Valentine Day 2022: వాలెంటైన్స్ డే రోజున మీరు సింగిల్ గా ఉన్నారా? అయితే ఇవి చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook