Mosquito Remedies: దోమల బెడద తగ్గించుకోవడానికి ఇంటి చుట్టుపక్కల ఈ మొక్కలు నాటండి!

Mosquito Remedies: దోమకాటు నివారణకు మార్కెట్ లో లోషన్లు, క్రీములు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కానీ, కొన్ని నేచురల్ టిప్స్ తో దోమల బెడదను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 09:05 PM IST
Mosquito Remedies: దోమల బెడద తగ్గించుకోవడానికి ఇంటి చుట్టుపక్కల ఈ మొక్కలు నాటండి!

Mosquito Remedies: వర్షాలకు దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఉదయం, సాయంత్రం వేళల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. అలాగే, దోమకాటు వల్ల అనేక అలెర్జీకి కారణమవుతుంది. అయితే ఇంటి చుట్టు కొన్ని మొక్కలు నాటడం వల్ల దోమల బెడద నుంచి బయటపడొచ్చు. 

మొక్కల వల్ల దోమలు బెడద ఉండదు..

దోమకాటు నివారణకు మార్కెట్లో అనేక లోషన్లు, క్రీములు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి దోమలు కుట్టకుండా సహజ పద్ధతిని అవలంబించడం ఉత్తమం.

బంతి పువ్వు

పువ్వుల్లో బంతిపువ్వు ఎక్కువగా వికసించి ఉంటుంది. ఈ పూల నుంచి వచ్చే వాసనను దోమలు ఇష్టపడవు. అందుకే ఈ మొక్కకు దోమలు దూరంగా ఉంటాయి. ఈ మొక్కను నాటడం వల్ల ఇంటి అందం పెరగడంతో పాటు దోమల బెడద కూడా నివారించుకోవచ్చు. ఇంటి గుమ్మం ఎదుట లోపలకు దోమలకు ఉండదు. 

లావెండర్ పుష్పాలు..
లావెండర్ మొక్క ఆకుల ఉండే నూనె గుణాలు.. సువాసన వల్ల ఇంటి చుట్టు పక్కలకు దోమలు, కీటకాలు కూడా దరిచేరవు. ఈ మొక్క పెరగడానికి నీరు కూడా అవసరం లేదు. 

తులసి, పుదీనా మొక్కలు..

తులసి, పుదీనా మొక్కల్లో రెండూ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తులసి, పుదీనా ఇంట్లో దోమలు రాకుండా చేస్తాయి. తులసి ఆకుల నుండి వచ్చే సువాసన దోమలు.. కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుదీనా దోమలే కాదు, ఈగలు, చీమలు కూడా ఇంటికి దూరంగా ఉంటాయి.

Also Read: Onion Chopping Without Tears: ఉల్లిపాయ కోసేప్పుడు కంటి నీరు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Also Read: Do Not Google It: ఇకపై గూగుల్ లో వీటి గురించి సెర్చ్ చేస్తే జైలుశిక్ష తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News