Mustard Oil For Swollen Feet: కాళ్లలో గాయాలు, ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో ఆకస్మిక వాపు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధరణమైనప్పటికీ.. వాపు తర్వాత తీవ్రమైన నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిని వినియోగించడం వల్ల భవిష్యత్‌లో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ఆవాల నూనెతో వాపులను తగ్గించవచ్చా?:
ప్రస్తుతం చాలా మందిలో పదాల్లో తీవ్ర మార్పుల కారణంగా వాపుల సమస్యలు వస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో లభించే మందులను వినియోగించడం వల్ల అలెర్జీ సమస్యలు వస్తున్నాయి. అయితే పాదాలకు ఈ నూనెను వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం పొందొచ్చు.
మస్టర్డ్ ఆయిల్:
మస్టర్డ్ ఆయిల్‌లో పసుపును కలుపుకుని వాపు ఉన్న ప్రదేశాలలో మసాజ్ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర నొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. పసుపులో యాంటీమైక్రోబియల్, యాంటిసెప్టిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా వాపు, నొప్పుల సమస్యలు దూరమవుతాయి.
మస్టర్డ్ ఆయిల్, అల్లం:
మస్టర్డ్ ఆయిల్‌లో అల్లాన్ని వేసి మరిగించి.. ఆ నూనెను వాపు ఉన్న చోట నూనెను అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా నొప్పులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
మస్టర్డ్ ఆయిల్ విత్ లవంగం:
పాదాల వాపును తగ్గించడానికి మస్టర్డ్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మస్టర్డ్ ఆయిల్ విత్ లవంగాలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కీళ్ల వాపులు నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook