Onam Festival: ఓనం పండుగ రోజున కేరళలో వండుకునే వంటకాలు ఇవే.. మీరు కూడా ఇలా సులభంగా చేసుకోవచ్చు..

Onam 2022: కేరళలో ఓనం పండుగ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పండగను కేరళ ప్రజలు దాదాపు తొమ్మిది నుంచి పది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా వివిధ దేవతలను కూడా పూజిస్తారు. అంతేకాకుండా పడవలను పూలతో చక్కగా అలంకరించి.. వాటికి రంగులు కూడా వేస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 10:04 AM IST
  • ఓనం పండుగ రోజున వండుకునే వంటకాలు ఇవే..
  • ముఖ్యంగా ఈ నాలుగు వంటకాలు వండుకుంటారు
  • మీరు కూడా ఇలా సులభంగా చేసుకోవచ్చు..
Onam Festival: ఓనం పండుగ రోజున కేరళలో వండుకునే వంటకాలు ఇవే.. మీరు కూడా ఇలా సులభంగా చేసుకోవచ్చు..

Onam 2022: కేరళలో ఓనం పండుగ ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ పండగను కేరళ ప్రజలు దాదాపు తొమ్మిది నుంచి పది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండగలో భాగంగా వివిధ దేవతలను కూడా పూజిస్తారు. అంతేకాకుండా పడవలను పూలతో చక్కగా అలంకరించి.. వాటికి రంగులు కూడా వేస్తారు. ముఖ్యంగా ఓనం పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కేరళ ప్రజలంతా వివిధ రకాల ఆహారాలను వండుకొని తింటారు. అయితే ఈ పండగ రోజున కేరళ ప్రాంతీయులు కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. అందులో ఎంతో ప్రసిద్ధి చెందిన పలు వంటకాలు ఉంటాయి. ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vazhakkai Erissery:
 కేరళ ప్రాంతీయ సాంప్రదాయక వంటకంగా చెప్పుకుంటారు. ఈ వంటకాన్ని చేయడానికి గుమ్మడి కాయలు వినియోగిస్తారు. అయితే ఓనం పండుగ పర్వదినాన ఈ వంటకాన్ని కేరళ ప్రాంతీయులంతా ఇష్టంగా వండుకొని తింటారు. సైంటిఫిక్ ప్రకారం.. ఈ వంటకంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఓనం పండుగ పర్వదినాన దీనిని వండుకొని తింటారు.

Onam Special Pachadi:
పూనం పండగ రోజున తీసుకునే ఆహారంలో తప్పకుండా ఈ పచ్చడిని తీసుకుంటారు. దీన్ని తయారు చేయడం చాలా తేలిక. ఇందులో పచ్చి కొబ్బరి తురుము, పైనాపిల్, పెరుగు వంటి పోషకాలు ఉన్న కూరగాయలతో చేస్తారు. ఇది శరీర అభివృద్ధికి సహాయపడడమే కాకుండా మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది.

Aviyal Recipe:
అవయల్ అనేది ఓ రుచికరమైన వంటకం.. ఇది అన్ని కూరగాయలను ఉపయోగించి తయారు చేస్తారు. ముఖ్యంగా ఇందులో క్యారెట్, బంగాళదుంప వంటి అధిక పోషకాలున్న ఆయనతో తయారు చేయడం విశేషం.

Pulissery Recipe:
పులిసెరి ఓనం పర్వదినాన అందరూ ఉదయం పూట ఆహారంలో భాగంగా దీనిని తీసుకుంటూ ఉంటారు. దీనిని గుమ్మడికాయ, దోసకాయ, మజ్జిగ తో తయారు చేశారు. కాబట్టి దీనిని పిల్లలైనా.. పెద్దవారైనా ఎంతో ఇష్టంతో తింటారు. దీనిని పరాటా లేదా రోటీలతో తీసుకుంటా ఎంతో రుచికరంగా ఉంటుంది.

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News