Onion Oil For Joint Pains: ఉల్లిపాయ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడానికి దోహదపడతాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణాల్లో ఉంటాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఉల్లిపాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారాల్లో వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే ప్రస్తుతం వీటితో తయారు చేసిన నూనె కూడా మార్కెట్‌లో విచ్చలవిడిగా లభిస్తోంది. అయితే ఈ నూనెను జాయింట్ పెయిన్స్ ఉన్నవారు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నూనె వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఉల్లిపాయ నూనెతో కలిగే ప్రయోజనాలు:
జుట్టును బలోపేతం చేస్తుంది:
జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారికి ఉల్లిపాయే కాకుండా ఉల్లి నూనె కూడా ప్రభావవంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
ఉల్లిపాయ నూనె జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు డయేరియా, డైసెంట్రీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
నొప్పిల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
ఉల్లిపాయ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ నూనెతో ప్రభావితం ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వాపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
నిద్రలేమి సమస్యలు:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది నిద్ర లేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఈ నూనెతో హెడ్ మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ నిద్ర నాణ్యతను మెరుగుపరుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.