How To Make Paneer Face Pack: పనీర్ శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. పనీర్ శరీరానికే కాకుండా చర్మానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాని మృదువుగా చేయడమే కాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభించేందుకు సహాయపడతాయి. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఖరీదైన ప్రొడక్షన్ వినియోగించకుండా పనీర్ ఫేస్ మాస్కులు వినియోగించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఫేస్ మాస్కుని ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
1 టీ స్పూన్ పనీర్ మిశ్రమం
2 టీ స్పూన్ పెరుగు
1 టీ స్పూన్ గంధపు పొడి
ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..
ఫేస్ మాస్క్ తయారీ పద్ధతి:
ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మిశ్రమంలో తయారు చేసుకున్న రెండు చెంచాల పనీర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇదే గిన్నెలో ఒక చెంచా చందనం పొడి మరో చెంచా పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిశ్రమంలో తయారు చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుని వినియోగించుకోవచ్చు.
ఫేస్ మాస్కుని వినియోగించే పద్ధతి:
పనీర్ ఫేస్ మాస్క్ ను వినియోగించడానికి ముందుగా నీటితో ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.
శుభ్రం చేసుకున్న ముఖాన్ని ఒక నిమిషం పాటు కాటన్ తువాలతో తూడ్చుకోవాలి.
ఇలా తుడుచుకున్న తర్వాత పనీర్ ఫేస్ మాస్కుని ముఖానికి రాసుకొని 15 నుంచి 20 నిమిషాల దాకా ఆరనివ్వాలి.
ఇలా ఆరిన తర్వాత కాటన్ తో ముఖానికి అద్భుతం నీటిని స్ప్రెడ్ చేయాలి.
ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మరో ఐదు నిమిషాల పాటు ముఖాన్ని వేళ్ళతో నెమ్మదిగా మసాజ్ చేయాలి.
ఇలా ఫేస్ మాస్క్ ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల ముఖపై చర్మం మృదువుగా మారుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
ఇది కూడా చదవండి : Leopard Attack Viral Videos: అడుగులో అడుగేసుకుంటూ సైలెంటుగా వచ్చిన చిరుత.. అక్కడే నిద్రిస్తున్న వ్యక్తి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK