Pesara Punugulu Recipe: పెసరపప్పు గుంత పొంగనాలు ఎప్పుడైనా ట్రై చేశారా?..ఇలా చేసుకోండి!

Pesara punugulu recipe: పెసరపప్పు గుంత పొంగనాలను అంటే అందరూ ఎంతగానో ఇష్టపతారు. అయితే వీటిని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 25, 2024, 02:25 PM IST
Pesara Punugulu Recipe: పెసరపప్పు గుంత పొంగనాలు ఎప్పుడైనా ట్రై చేశారా?..ఇలా చేసుకోండి!

Pesara punugulu recipe: గుంత పొంగనాలు అంటే తెలియవారు ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందిరికీ తెలుసు. వీటిని పునుగులు అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో చాలా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన చిరుతిండి. వీటిని అందరూ పులిసిన దోసె పిండితో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవి చూడడానికి గుండ్రని, గుంతల ఆకారంలో ఉంటాయి. అయితే చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. వీటిని పెసరపప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. పెసరలో ఉండే పోషకాలు శరీరానికి బోలెడు లాభాలను అందిస్తాయి. అంతేకాకుండా బాడీకి తగిన ప్రోటీన్స్‌ అందించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మీరు కూడా ఈ పెసరపప్పు గుంత పొంగనాలను ట్రై చేయాలనుకుంటున్నారా? ఇలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.

పెసరపప్పు గుంత పొంగనాలకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పెసరపప్పు
2 కప్పుల నీరు
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ శనగపిండి
1/4 టీస్పూన్ పసుపు
1/2 టీస్పూన్ కారం
2 టేబుల్ స్పూన్ల నూనె
1/4 కప్పు కొత్తిమీర
2 పచ్చిమిరపకాయలు (తరిగినవి)

తయారీ విధానం:
ముందుగా ఈ పెసరపప్పు గుంత పొంగనాలను తయారు చేసుకోవడానికి ఓ బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది..
ఈ గిన్నెలో పెసరపప్పును వేసి బాగా శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నానబెట్టుకోండి.
ఒక గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు, నీరు, ఉప్పు వేసి బాగా కలపండి.
ఈ మిశ్రమాన్ని ఒక ప్రెషర్ కుక్కర్‌లో పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
ఉడికించిన పెసరపప్పును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.
ఆ తర్వాత అందులో జీలకర్ర, శనగపిండి, పసుపు, కారం వేసి బాగా కలపండి.
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, పచ్చిమిరపకాయలు వేసి వేయించండి.
వేయించిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మరోసారి బాగా కలపండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
వీటన్నింటిని మిక్సీలో వేసుకుని పిండి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత పొంగనాల స్పెషల్ పాన్‌ తీసుకుని స్టౌప్‌పై పెట్టుకుని వేడి చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేడి చేసిన తర్వాత అదే పాన్‌లో పిండిని వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.
ఆ తర్వాత వాటిని బయటకు తీసి వేడి వేడిగా అరటిపండు లేదా కొబ్బరి చట్నీతో కలిసి సర్వ్ చేయండి.

చిట్కాలు:
పెసరపప్పును బాగా నానబెట్టడం వల్ల త్వరగా ఉడికిపోతుంది.
పిండి చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా ఉండకుండా జాగ్రత్త వహించండి.
ముద్దలను చాలా మందంగా ఉండకుండా పిండి కొంచెం కొంచెం వేసుకోండి.
మీరు వీటిని తయారు చేసుకునే క్రమంలో పిండిలో ముక్కలుగా కొసిన ఉల్లిని కూడా వినియోగించవచ్చు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News