Pomegranate Juice For Heart Patients: దానిమ్మలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన జ్యూస్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల గుండెకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా అధిక పరిమాణాలు లభిస్తాయి. కాబట్టి దానిమ్మను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
దానిమ్మను ఆహారంలో తీసుకోవడం గుండె కలిగి ప్రయోజనాలు:
దానిమ్మలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.
చర్మానికి కలిగే ప్రయోజనాలు:
దానిమ్మ రక్తాన్ని శుభ్రపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో తయారు చేసిన జ్యూస్‌ని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవ్వడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేసేందుకు దోహదపడుతుంది.
రక్తహీనత సమస్యలకు చెక్:
దానిమ్మలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దానిమ్మతో తయారు చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తహీనతను తొలగించేందుకు సహాయపడుతుంది.
జీర్ణక్రియ సమస్యలకు తగ్గిస్తుంది:
దానిమ్మ రసం ప్రతి రోజూ తాగడం వల్ల జీర్ణక్రియకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా కడుపు నొప్పి, ఉబ్బరం నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
Also read: Supreme Court: ఏపీ హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు, సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook