Protein Diet: ప్రోటీన్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. బాడీకి సరైన ప్రోటీన్లు అందకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి ప్రోటీన్లు తప్పక అవసరమవుతాయి. అంతేకాకుండా ఇది పెరుగుతున్న శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తాయి. కాబట్టి ప్రోటీన్లు శరీరా నికి చాలా అవసరం అయితే చాలా మంది బిజీ లైఫ్ కారణంగా ఆహారాలను సరిగా తీసుకోవడం లేదు దీనివల్ల ప్రోటీన్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికంగా ప్రోటీన్లను తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా తీవ్ర శారీరక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రోటీన్లను శరీరానికి అవసరమైనంతనే తీసుకోవడం చాలా ముఖ్యం.
అధిక ప్రోటీన్ ఆహారాలు:
చాలామంది శరీరాకృతిని పెంచుకోవడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. అంతేకాకుండా జిమ్ కు వెళ్లి వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఫిట్నెస్ లో భాగంగా ఇలా ప్రోటీన్ గల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం ఫిట్ గా మారే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆకలి తగ్గి వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువే.. కాబట్టి తప్పకుండా ప్రోటీన్ తీసుకునే క్రమంలో శరీరానికి అవసరమైనంతవరకే తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంత ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది?:
డైటీషియన్లు సూచించిన ప్రకారం బరువుకు అనుగుణంగా ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. 50 కిలోల శరీర బరువు ఉంటే ప్రతిరోజు 50 గ్రాముల ప్రోటీన్ మాత్రమే తీసుకోవాల్సిన ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్లే శరీరం అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కువ ప్రోటీన్లు తీసుకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రోటీన్లు తీసుకునే ముందు వైద్యులను లేదా డైటీషియన్లను సంప్రదించడం చాలా మంచిది.
ప్రోటీన్లు అధికంగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు:
ఊబకాయం సమస్య:
చాలామంది బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటారు. అంతేకాకుండా వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటున్నారు. అయితే దీనివల్ల ఊబకాయం సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నప్పుడు డైటీషియన్లను సంప్రదించడం చాలా మంచిది.
జీర్ణక్రియ సమస్యలు:
అధిక మొత్తంలో ప్రోటీన్ గల ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు. కొందరిలో మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది.
Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?
Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook