Turmeric for Skin Allergy: చర్మంపై అలెర్జీని ఈ మిశ్రమంతో 2 రోజుల్లో ఉపశమనం పొందండి..!

Relieve Skin Allergy In 2 Days: పురాతన కాలం నుంచి పసుపును ఔషధంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా దీనిని ఇంటి నివారణగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు గాయాల నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 01:23 PM IST
  • పసుపు, తేనె మిశ్రం చర్మానికి..
  • చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది
  • చర్మంపై అలెర్జీని నియంత్రిస్తుంది
Turmeric for Skin Allergy: చర్మంపై అలెర్జీని ఈ మిశ్రమంతో 2 రోజుల్లో ఉపశమనం పొందండి..!

Relieve Skin Allergy In 2 Days: పురాతన కాలం నుంచి పసుపును ఔషధంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా దీనిని ఇంటి నివారణగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు గాయాల నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా పసుపును చర్మ సౌందర్యం కోసం కూడా వినియోగించడం విశేషం. చర్మంపై దద్దుర్లను, ఇతర సమస్యలను తొలగించేందుకు సహాయపడుతుంది. కావున శరీరంపై చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ముఖంపై చర్మాన్ని సౌందర్యాన్ని ఇస్తుంది.  

స్కిన్  అలెర్జీకి పసుపు ఎలా సహాయపడుతుంది:

ప్రస్తుతం వానాకాలం కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాకుండా చర్మంపై పలు రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడానికి పసుపును వాడాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇది మార్కెట్‌ లభించే ఖరీదైన క్రీమ్ కంటే చర్మంపై ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కావున చర్మంపై దద్దుర్లు,  దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మ అలెర్జీ కోసం పసుపును వాడొచ్చా..?:

వానా కాలంలో చర్మంపై అలర్జీ వంటి సమస్యలు పెరుగుతాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందడానికి కలబంద, రోజ్ వాటర్, వేపపిండి, పసుపును కలిపి మిశ్రమంగా చేసి వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

1. పసుపు, కలబంద మిశ్రమం:

చర్మంపై దద్దుర్ల సమస్యలుంటే పసుపు, కలబంద మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేచండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు.. ముందుగా రెండు టీస్పూన్ల పసుపును తీసుకోవాలి. అందులో కలబంద పేస్ట్‌ వేసి మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పూట ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి.

2. చర్మ అలెర్జీకి పసుపు:

ఒక వేళా మీకు కలబంద లభించకపోతే దానికి బదులుగా పసుపును వినియోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మపై అన్ని రకాల అలెర్జీలను దూరం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే దీనిని కూడా అలెర్జీ ఉన్న వారు క్రమం తప్పకుండా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.   

3. పసుపు, తేనె మిశ్రమం:

వానా కాలంలో చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు. ఇందులో ప్రధానంగా వాతావరణంలో తేమ వల్ల చర్మంపై అలెర్జీ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీని కోసం  పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని కోసం 1 టీస్పూన్ తేనె తీసుకొని అందులో చిటికెడు పసుపు కలపండి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను అలర్జీ ఉన్న చోట అప్లై చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తర్వలోనే ఉపశమనం లభిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)  

Also read: Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్‌ పెట్టొచ్చు..!

Also read: Hair Care Tips: స్ట్రెయిటెనింగ్‌ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News