Musty Smell From Clothes: వానల కారణంగా బట్టలు దుర్వాసన వస్తున్నాయా?, ఇలా చేయండి చాలు..

How To Remove Mildew Smell From Clothes: వానా కాలంలో బట్టలు ఆరకపోవడం వల్ల దుర్వాసన వస్తూ ఉంటాయి. వీటిని ధరించడం వల్ల మనకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాసన నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 6, 2023, 01:35 PM IST
Musty Smell From Clothes: వానల కారణంగా బట్టలు దుర్వాసన వస్తున్నాయా?, ఇలా చేయండి చాలు..

How To Remove Mildew Smell From Clothes: మండుతున్న ఎండల నుంచి వానల ద్వారా ఉపశమనం లభించింది. ఇప్పటికే భారత దేశవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. అయితే వాతావరణం లో తేమ పెరగడం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీని కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్, ఇన్ఫెక్షన్ల ప్రభావం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వాతావరణం లోని చల్లదనం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ప్రస్తుతం అందరూ ఎదుర్కొనే సమస్యల్లో బట్టలు ఆరకపోవడం వల్ల బట్టల నుంచి దుర్వాసన రావడం ఒకటి. వానాకాలంలో ఇలాంటి సమస్యలు రావడం సర్వసాధారణం. చాలామంది దుర్వాసన గల దుస్తులను ధరించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆ టిప్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తడి బట్టలు నుండి దుర్వాసన తొలగించే టిప్స్ ఇవే.. 
✴ వానాకాలంలో బట్టలను ఉతికే గ్రామంలో కర్పూరం నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాకుండా వీటిని పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాల్సి ఉంటుంది.

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

✴ అల్మారా లో బట్టలను పెట్టేముందు కర్పూరం మొక్కలను ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాసన కీటకాల నుంచి బట్టలను సంరక్షిస్తుంది. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగిపోతుంది.

✴ బట్టల్లో తేమ పరిమాణాలు పెరగడం కారణంగానే దుర్వాసన రావడం మొదలవుతుంది. తరచుగా నీ బట్టల నుంచి దుర్వాసన వస్తే మీరు బట్టలు జాడించే క్రమంలో నీటిలో ఒక కప్పు నిమ్మరసం కలపాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన తొలగిపోయి బట్టలు కూడా నిమ్మకాయ ఫ్లెవర్ తో గుమగుమలాడుతాయి.

✴ వాన కాలంలో బట్టలను ఉతికిన తర్వాత ఆరలేకపోతే వాటిని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాల్సి ఉంటుంది. ఇలా ఆరనిస్తేనే బట్టలు వాసన రాకుండా ఉంటాయి. లేకపోతే బ్యాడ్‌ స్మెల్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

✴ బేకింగ్ సోడా నీటితో బట్టలు ఉతుకడం వల్ల కూడా దుర్వాస నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దుస్తువుల కూడా క్లీన్‌గా ఉంటాయి.

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News