Rosemary Leaves Health Benefits: మనలో చాలా మంది తొందరగా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. దీనికి కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం. అలాగే పోషకరమైన ఆహారం తీసుకోకపోవడం. అయితే కొన్ని విలువైన పదార్థాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజ్మేరీ ఆకులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
రోజ్మేరీ చూడడానికి చిన్నగా ఉంటుంది. ఇది ధనియాలు, లావెండర్ కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క మెడిటరేనియన్ ప్రాంతానికి చెందినది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. రోజ్మెరీ ఆకులు ఒక ప్రత్యేకమైన, సువాసనగల రుచిని కలిగి ఉంటుంది. ఈ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
రోజ్మెరీ ఆకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
రోజ్మేరీ ఆకులతో తయారు చేసిన నూనెను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇది పరిశోధనలో కూడా తేలింది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాలను మెరుగుపరచడంలో అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. రోజ్మెరీ ఆకులు జీర్ణవ్యవస్థన మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
రోజ్మెరీలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. దీని వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఎంతో మేలు చేస్తుంది. రోజ్మెరీ నూనెను కీళ్ల నొప్పులకు, కండరాల సమస్యలకు, తలనొప్పి వంటి వాటికి ఉపయోగించడం వల్ల ఉపశమనం పొందవచ్చు.
జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రోజ్మెరీతో తయారు చేసిన ప్రొడెక్ట్స్‌ను ఉపయోగించవచ్చు. ఇది జుట్టు సమస్యలకు ఎంతో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
రోజ్మెరీ ఆకులను ఎలా ఉపయోగించాలి:
* రోజ్మెరీ ఆకులను వంటకాల్లో తాజాగా లేదా ఎండిన రూపంలో ఉపయోగించవచ్చు.
* రోజ్మెరీ నూనెను మసాజ్ ఆయిల్‌గా లేదా అరోమాథెరపీలో ఉపయోగించవచ్చు.
* రోజ్మెరీ టీని తయారు చేయడానికి రోజ్మెరీ ఆకులను వేడి నీటిలో కూడా ఉడికించవచ్చు.
గమనిక:
రోజ్మెరీ గర్భవతి లేదా పాలిచ్చే మహిళలకు సురక్షితం కాదని గమనించడం ముఖ్యం. రోజ్మెరీని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించి మీరు ఉపయోగించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి