Rosemary Water Hair Benefits: జుట్టు పెరుగుదలకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. జుట్టు అందంగా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ఈ చర్యలు చేపడతాం. అయితే రోజ్మెరీ తో కూడా జుట్టు బలంగా అందంగా పెరుగుతుందని మీకు తెలుసా? రోజ్మెరీ ఆయిల్, సీరమ్‌లు మార్కెట్లో చూసే ఉంటాం. అయితే ఈరోజు రోజ్మెరీ తో మనం వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు దీంతో జుట్టుకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ఈ రోజ్మెరీ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టును మృదువుగా మారుస్తాయి. కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. రోజ్మెరీ వాటర్ తో మన జుట్టుకు కలిగి ప్రయోజనాలు తెలుసుకుందాం.
ముఖ్యంగా రోజ్మెరీలొ యువరసోనిక్ ఆసిడ్ రోస్, రోజ్మెరీనిక్ ఆసిడ్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ మైక్రోబియన్ గుణాలు కలిగి ఉంటాయి. జుట్టుకు అప్లై చేయడం వల్ల తలలో బ్లడ్ సర్కులేషన్ మెరుగు పరుస్తాయి. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదల..
రోజ్మెరీ నీటిని జుట్టుకు తరచూ అప్లై చేయడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. ఇందులో యువర్ సోలిక్ యాసిడ్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి కుదుళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది, జుట్టును బలంగా మారుస్తుంది.
హెయిర్ ఫాల్..
రోజ్మెరీ వాటర్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల హెయిర్ లాస్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేషన్ గుణాలు జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.
హెయిర్ ఫాలికల్స్..
ఒకవేళ మీ జుట్టు డ్యామేజ్ అయి బలహీనంగా ఉంటే రోజ్మెరీ వాటర్ ని అప్లై చేయండి. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది అంతేకాదు స్ప్లిట్ ఎండ్ సమస్యను కూడా నివారిస్తుంది.
ఇదీ చదవండి: ఉప్మారవ్వతో చిల్లా.. ఇలా చేస్తే బరువు ఈజీగా తగ్గిపోవాల్సిందే..
జుట్టు మందం
రోజ్మెరీ వాటర్ ఉపయోగిస్తే తలపై మ్యాజిక్ జరుగుతుంది. ఇది చుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెప్పి పెడుతుంది. ముఖ్యంగా మీ జుట్టు మందంగా పెరుగుతుంది. ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఆక్సిడేటివ్స్ డ్యామేజ్ నుంచి నివారిస్తుంది. జుట్టుకు పునరుజ్జీవనం అందిస్తుంది. రోజ్మెరీ వాటర్ ని జుట్టు అంతా స్ప్రే చేసి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి దీంతో జుట్టు కూడా మెరుస్తుంది.
డాండ్రఫ్..
డాండ్రఫ్ తో సమస్య ఉండి, కుదుళ్ళు దురద అనిపించే వారికి రోజ్మెరీ ఒక గోల్డెన్ వరం. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు డాండ్రఫ్ సమస్యకు చెక్ పెడుతుంది.
నాచురల్ కండిషనర్..
ఈ రోజ్మెరీ వాటర్ నాచురల్ కండిషనర్ల పనిచేస్తుంది. ఇది జుట్టుకు మాయిశ్చర్ ని సహజసిద్ధంగా అందిస్తుంది. హైడ్రేటెడ్ గా కనిపించేలా చేస్తుంది.
ఇదీ చదవండి: ఉదయం ఖాళీ కడుపున ఈ నీటిని తాగితే చాలు.. బరువు మీకు తెలియకుండానే తగ్గిపోతారు..
రోజు మేరీ వాటర్ తయారీ విధానం..
ఫ్రెష్ లేదా వాడిన రోజు మేరీ ఆకులు, నీళ్లు
రోజు మేరీ ఆకులను వేసి నీటిలో కాసేపు మరిగించాలి. ఒక 20 నిమిషాల తర్వాత ఒక స్ప్రే బాటిల్ లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఆ తర్వాత జుట్టు అంతటికీ ఈ రోజ్మెరీ వాటర్ ని స్ప్రే చేసుకోవాలి
తలస్నానం చేసిన తర్వాత రోజు మీది వాటర్ ని జుట్టు అంతా స్ప్రే చేసుకోవాలి జుట్టుకు కాసేపు మసాజ్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ మెరుగవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి