Basil Seeds Drink Benefits: సమ్మర్‌లో సబ్జా నీళ్లు ఎందుకు తాగాలంటే..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Sabja Seeds Benefits In Summer: వేసవిలో చల్లని కూల్‌ డ్రింక్స్‌, పండ్ల రసాలతో పాటు ఈ ఆరోగ్యకరమైన సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో లాభాలును అందిస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2024, 10:14 AM IST
Basil Seeds Drink Benefits: సమ్మర్‌లో సబ్జా నీళ్లు ఎందుకు తాగాలంటే..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Sabja Seeds Benefits In Summer: వేసవికాలంలో మన శరీరం డిహైడ్రేషన్ , అలసట వంటి సమస్యల తలెత్తతాయి. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఇలాంటి టైమ్‌లో సబ్జా గింజల నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గింజలు శరీరాన్ని చల్లబరడమే కాకుండా బోలెడు ఆరోగ్య లాభాలను కూడా పొందవచ్చు. అయితే ఆ లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 సబ్జా గింజల్లో ప్రోటీన్స్, మినరల్,  ప్లాంట్ కాంపౌండ్స్ , ఒమేగా-3 ఫాటేఅసిడ్స్  ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు సబ్జా గింజలు నానబెట్టి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీంతో పాటు శరీరం యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా సబ్జా గింజల్లో విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్ సమ్మర్లో కలిగే జుట్టు సమస్యలను తగ్గుతాయి. సబ్జా గింజల్లోని ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు ఆరోగ్యానికి సహాయపడుతాయి. ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగపడుతాయి. రోజు సబ్జా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తహీనత , కీళ్ల నొప్పి, తలనొప్పి, అలసట వంటి ఇతర సమస్యలు కూడా మాయమవుతాయి. సబ్జా గింజల్లో ఉండే ఫైబర్  ఆహ్వానాన్ని జీర్ణం చేయడంలో ఎంతో సహాయపడుతుంది.
 
సమ్మర్ లో పిల్లలకు ప్రతిరోజు సబ్జా నీళ్లు ఇవ్వడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే పిల్లలలో వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సబ్జా గింజలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే తీసుకొని దీన్ని నిమ్మరసంతో కానీ తేనెతో కలుపుకొని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.  అలాగే  దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం కారణంగా దగ్గు, జలుబు వంటి ఇతర ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి.

సబ్జా నీళ్లు తయారీ:

కావలసిన పదార్థాలు:

* 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు
* 1 గ్లాసు నీరు
* నిమ్మరసం లేదా తేనె (రుచికి అనుగుణంగా)

మరింత రుచి కోసం: 

* పుదీనా ఆకులు
* తులసి ఆకులు
* యాలకుల ముక్కలు

తయారీ విధానం:

రాత్రి సమయంలో ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయం, నీటిని వడకట్టి, సబ్జా గింజలను తినండి. రుచికి అనుగుణంగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోండి. మరింత రుచి కోసం, పుదీనా ఆకులు, తులసి ఆకులు లేదా యాలకుల ముక్కలు కూడా కలుపుకోవచ్చు. దీనిని చల్లగా కావాలంటే, ఫ్రిజ్‌లో ఉంచండి.

చిట్కాలు:

* ఖాళీ కడుపుతో సబ్జా నీళ్లు తాగడం మంచిది.

* రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల సబ్జా నీళ్లు తాగవచ్చు.

* పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలు సబ్జా నీళ్లు తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News