రొమాంటిక్ యాంగిల్ లో సాహో ; శ్రద్ధా కపూర్ తో కలిసి దుమ్మరేపిన ప్రభాస్

యాక్షన్ మూవీగా ప్రయోట్ అయిన సాహోలో ఎవరికీ తెలియని మరో యాంగిల్ దాగి ఉందంటున్నారు చిత్రయూనిట్

Last Updated : Apr 17, 2019, 08:52 PM IST
రొమాంటిక్ యాంగిల్ లో సాహో ; శ్రద్ధా కపూర్ తో కలిసి దుమ్మరేపిన ప్రభాస్

ప్రభాస్ హీరోగా తెరపైకి వస్తున్న ‘సాహో’ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేవి యాక్షన్ సీన్స్. ఫిల్మ్ మేకర్స్ ఈ సీక్వెన్సెస్ నే హైలెట్ చేస్తుండంతో అభిమానులు యాక్షన్ మూవీగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.  అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి బయటికి వచ్చిన ఒక స్టిల్ మాత్రం ‘సాహో’ పై ఉన్న అభిప్రాయాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

‘సాహో’ ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాదు ప్రమోషన్ ప్రాసెస్ కూడా చాలా పకడ్బందీ గా నడుస్తుంది. ‘షేడ్స్ ఆఫ్ సాహో’ అంటూ ఒక్కొక్కటిగా విజువల్స్ ని రిలీజ్ చేస్తూ.. ఆడియెన్స్ సినిమా నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేయాలో కూడా మేకర్సే క్లారిటీ ఇస్తున్నారు. అయితే ప్రభాస్, శ్రద్ధా కాంబినేషన్ లో ఉన్న ఈ రొమాంటిక్ స్టిల్ మాత్రం, ‘సాహో’ లో జస్ట్ యాక్షన్ ఒక్కటే కాదు.. అంతకు మించిన మ్యాజిక్ ఏదో ఉండబోతుందనే వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

Trending News