Side Effects Of Peanuts: వేరుశెనగ ఆరోగ్యానికి చాలా మంచది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తాయి. ఇందులో బాడీకి అవసరమైన విటమిన్ ఇ, విటమిన్ బి, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇవి శరీర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపతాయి. అయితే చాలా మంది శరీర, కండరాల అభివృద్ధికి నానబెట్టిన వేరుశెనగలను తింటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యక్తులు పొరపాటున కూడా నానబెట్టిన వేరుశెనగ తినకూడదు:
కీళ్లనొప్పుల సమస్య:
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు నానబెట్టిన వేరుశెనగను తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల వాపు, నొప్పుల వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే వేరుశెనగలో లెక్టిన్ అనే మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కామెర్లు, కాలేయం దెబ్బతినడం:
నానబెట్టిన వేరుశెనగ తినడం వల్ల శరీరంలో అఫ్లాటాక్సిన్ అనే హానికరమైన పదార్ధం పెరుగుతాయి. దీని వల్ల కళ్లు పసుపు రంగులోకి మారి ఆకలి తగ్గుతుంది. అంతేకాకుండా కాలేయం బలహీనంగా మారే అవకాశాలున్నాయి. దీంతో కామెర్ల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
పొట్ట సమస్యలున్నవారు తినొచ్చా..?:
మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు నానబెట్టిన వేరుశెనగలను తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
ఫైటిక్ యాసిడ్:
నానబెట్టిన వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైటిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిది.
Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్
Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook