Skin Care Tips: చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇలా చెక్‌ పెట్టండి..

Skin Care Home Remedies: వాతావరణం మార్పుల కారణంగా చాలామంది చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది చర్మం పగుళ్లు, పొడి చర్మం వంటి సమస్యల బారిన పడడం విశేషం. అయితే వీరి కోసం ఆరోగ్య నిపుణులు పలు రకాల చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 01:55 PM IST
  • వాతావరణంలో కలుష్యం పేరగడం కారణంగా
  • చర్మ సమస్యలు వస్తున్నాయి.
  • వీటికి చెక్‌ పెట్టడానికి ఈ చిట్కాలను ఉపయోగించండి.
Skin Care Tips: చలి కాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఇలా చెక్‌ పెట్టండి..

Skin Care Home Remedies: వాతావరణం మార్పుల కారణంగా చర్మం అనారోగ్యకరంగా మారుతుంది. వాతావరణ కాలుష్యం చర్మంపై ప్రభావం పడి చర్మం పై పగుళ్లు ఏర్పడుతున్నాయి. పోను పోను ఇది చర్మంపై తీవ్ర సమస్యగా మారుతోంది. అయితే ఈ సమస్యలు కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ చర్మం పగుళ్ల నుంచి రక్షణ పొందడానికి తప్పకుండా పలు నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే తీవ్రంగా చర్మం దెబ్బ తినే అవకాశం ఉంటుంది. దీనికోసం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలో మనం ఎప్పుడు తెలుసుకుందాం.

అలోవెరా జెల్:
అలోవెరా జెల్ లో చర్మానికి కావలసిన చాలా రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని రాత్రి పూట చర్మానికి అప్లై చేసి మసాజ్ చేస్తే.. చర్మానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి.

కొబ్బరినూనె:
కొబ్బరి నూనెలో కూడా చర్మానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు ఉంటాయి. ముఖ్యంగా పొడి చర్మం గలవారు దీనిని పడుకునే ముందు చర్మానికి రాసుకొని పడుకుంటే.. పొడి చర్మం సమస్యలు దూరం అవుతాయి.

దేశీ నెయ్యి:
నెయ్యిలో ఆరోగ్యమైన కొవ్వులు ఉంటాయి. అందుకే అందుకే చాలామంది దీనిని ఆహారాల్లో వినియోగిస్తారు. అయితే చర్మ సమస్యలతో బాధపడేవారు పడుకునే ముందు నెయ్యిని చర్మానికి రాసుకొని మసాజ్ చేస్తే.. సులభంగా చర్మ సమస్యలకు చెప్పి పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

మస్టర్డ్ ఆయిల్:
మస్టర్డ్ ఆయిల్ చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. పొడి చర్మం సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నూనెను శరీరానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. కాబట్టి పొడి చర్మం సమస్యలతో బాధపడేవాడు తప్పకుండా ఈ మస్టర్డ్ ఆయిల్ ని వినియోగించాలి.

Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 

Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Trending News