Skin Care: ఈ మిశ్రమం రోజూ రాస్తే చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Skin Care: అందం సగం ఆరోగ్యమంటారు. ఆరోగ్య పరిరక్షణే కాదు..అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. ఆధునిక జీవన విధానంలో సౌందర్య పరిరక్షణ తప్పనిసరిగా మారుతోంది. దీనికోసం సహజసిద్ధమైన పద్ధతులే మెరుగైన ఫలితాలనిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2023, 10:29 PM IST
Skin Care: ఈ మిశ్రమం రోజూ రాస్తే చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Skin Care: ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, కాలుష్యం వంటివి అందంపై ప్రభావం చూపిస్తుంటాయి. వయస్సు మీరకుండానే వృద్ధాప్య లక్షణాలు రావడం, పింపుల్స్ వంటివి ఏర్పడి అసహజంగా కన్పించడం సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు అవలంభించాలనేది తెలుసుకుందాం..

వాస్తవానికి సౌందర్య సంరక్షణకు మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. చాలామంది మార్కెట్‌లో లభించే బ్యూటీ ఉత్పత్తులతో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. విఫలమౌతుంటారు. ఒక్కోసారి దుష్పరిణామాలు ఎదురౌతుంటాయి. కారణం వీటిలో ఉండే కెమికల్స్. అందుకే సౌందర్య పరిరక్షణకు సహజసిద్ధ పద్ధతులను ఆశ్రయిస్తే మెరుగైన ఫలితాలుంటాయి. దీనికోసం ముల్తానీ మిట్టీ, తేనె కాంబినేషన్ అత్యుత్తమమైందిగా బ్యూటీషియన్లు చెబుతుంటారు. అనాదిగా ఈ విధానం అమల్లో ఉన్నదే. ఈ రెండూ చర్మానికి చాలా ప్రయోజనకరం. ఈ రెండూ కలిపి రాయడం వల్ల చాలా రకాల చర్మ వ్యాధులు దూరమౌతాయి. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా చర్మ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ముల్తానీ మిట్టీలో తేనె కలిపి రాయడం వల్ల చాలా సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. ఈ రెంటినీ కలిపి ఎలా రాయాలి, ఎలాంటి ప్రయోజనాలున్నాయో విపులంగా పరిశీలిద్దాం..

ముల్తానీ మిట్టీ తేనె కలిపి రాయడం వల్ల పింపుల్స్ సమస్య దూరమౌతుంది. ఎందుకంటే ముల్తానీ మిట్టీ, తేనెతో ముఖంపై పేరుకునే అదనపు ఆయిల్, వ్యర్ధాలు దూరమౌతాయి. ఫలితంగా పింపుల్స్ సమస్య తగ్గిపోతుంది. పింపుల్స్ సమస్యతో బాధపడుతుంటే ముల్తానీ మిట్టీ, తేనె మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ముల్తానీ మిట్టీ, తేనె కలిపి రాయడం వల్ల ముఖంపై నిగారింపు వస్తుంది. చర్మం రంగు తేలుతుంది. ట్యానింగ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే రోజూ ముల్తానీ మిట్టీ, తేనె కలిపి రాసుకోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా చర్మం డ్రై కాకుండా ఉంటుంది. చర్మాన్ని మృదువుగా, కోమలంగా చేస్తుంది.

ముల్తానీ మిట్టీలో కూలింగ్ గుణాలుంటాయి. దాంతో చర్మంలో మంట వంటి సమస్య పోతుంది. మీ చర్మం రెడ్‌నెస్ కూడా తొలగిపోతుంది. చర్మానికి కూలింగ్ చేకూరుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. రోజూ క్రమం తప్పకుండా రాస్తే 5-6 వారాల్లోనే ఫలితాలు చూడవచ్చు. చర్మం నిగారింపు, ముఖంపై ముడతలు లేకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ముల్తానీ మిట్టీ, తేనె మిశ్రమం అద్భుతమైన యాంటీ ఏజీయింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. 

Also read: Health Tips: లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపించే పదార్ధాలివే, వెంటనే డైట్ నుంచి దూరం చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News