Spinach Juice Magic: పెరుగుతున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది పాలకూర రసం కూడా తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో శరీరానికి అవసరమైన విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, విటమిన్ Kతో పాటు విటమిన్ B కాంప్లెక్స్ (B1, B2, B3, B6, B9, B12) అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటితో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రసం రోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలకూర రసంలో ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్లు అయినా లుటిన్, జియాక్సంతిన్, బీటా-కెరోటిన్, ఫెరులిక్ యాసిడ్ లభిస్తాయి. కాబట్టి రోజు తాగడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రసం రోజు తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
పాలకూర రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
కంటి ఆరోగ్యానికి:
పాలకూరలో ల్యుటిన్‌తో పాటు జియాక్సంతిన్ అనే రెండు ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రోజు ఈ రసం తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. అలాగే రేచికటి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
రక్తహీనత సమస్యలకు చెక్:
పాలకూరలో ఐరన్ ఎక్కువ పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ఈ ఆకులను రసంలా తయారు చేసుకుని తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి సులభంగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్త కణాల ఉత్పత్తికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
క్యాన్సర్ నివారణకు:
పాలకూరలోని కొన్ని ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్లను నివారించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె సమస్యలకు:
పాలకూరలో ఉండే ఫోలేట్ గుండెను శక్తివంతంగా చేసేందుకు ఎంతో సహాయపడుంది. ఇది హోమోసిస్టైన్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ప్రతి రోజు తప్పకుండా పాలకూర రసం తాగాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
బరువు తగ్గడానికి సహాయం:
పాలకూర కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
చర్మ ఆరోగ్యానికి:
పాలకూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ రసం తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్ అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.