Mutton Bone Soup Recipe: మటన్ బోన్ జ్యూస్ దీంతో తక్షణ శక్తితోపాటు కాళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గిపోతాయి. సాధారణంగా కాళ్లలో ఉండే బొక్కలు అరుగుదల మొదలవుతే బోన్ జ్యూస్ తాగాలని నిపుణులు సూచిస్తారు. అంతేకాదు సీజన్ మారి దగ్గు, జలుబు సమస్యలు వచ్చినప్పడు వేడివేడిగా స్పైసీ బోన్ బ్యూస్ తాగాలి. ఈరోజు ఘుమఘమలాడే మటన్ బోన్ జ్యూస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
మటన్ బోన్ జ్యూస్‌కు కావాల్సిన పదార్థాలు..
మటన్ -1/2 కేజీ
నీళ్లు 8 కప్పులు
ఉప్పు ఒక స్పూన్
పసుపు ఒక స్పూన్
ధనియాలు- 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి-5
మిరియాలు ఒక స్పూన్
జీలకర్ర ఒక స్పూన్
నెయ్యి-2 టీ స్పూన్స్
టమాటాలు-2
వెల్లుల్లి గడ్డ-1
కొత్తిమీర
ఇదీ చదవండి: నీరు తాగడానికి సరైన సమయం ఉంటుంది? తప్పక తెలుసుకోండి..
తయారీ విధానం...
ముందుగా మటన్ బోన్ ముక్కలను శుభ్రంగా కడిగి మటన్ తోపాటు నెయ్యి, పసుపు, ఉప్పు, మిరియాలు కుక్కర్లో వేసి అరగంటపాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నుంచి పూర్తిగా ఆవిరి పోయిన తర్వాత మూత తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో బాణాలి తీసుకుని అందులో మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కావాలంటే ఇక్కడ మీరు ఒక దాల్చిన చెక్క లేదా రెండు యాలకులు, నాలుగు లవంగాలు కూడా వేసుకోవచ్చు. దోరగా వేయించిన తర్వాత మిక్సిలో పొడి చేసుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి యాపిల్ జ్యూ స్.. ప్రయోజనాలు, చిట్కాలు ఇవే!
ఇప్పుడు వేయించిన గరంమసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. అవి మెత్తగా ఉడికి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఉప్పును సరిచూసుకుని వేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత మటన్ ముక్కలతోపాటు నీటిని కూడా వేసుకని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఘుమఘుమలాడే మటన్ బోన్ జ్యూస్ రెడీ. ఇది మీకు కావాలంటే రైస్, రోటీతో తినవచ్చు. జ్యూస్ నేరుగా తాగవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి