Lemon Benefits: నిమ్మకాయే కదా అని తీసిపడేయకండి.. చిన్నదే కానీ.. బోలెడు బెనిఫిట్స్!

Benefits of Lemon: నిమ్మకాయలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల బాడీకి ఎంతో లాభం ఉంది. నిమ్మరసం వల్ల కలిగే ఆరోగ్యకర  ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 12:04 PM IST
Lemon Benefits: నిమ్మకాయే కదా అని తీసిపడేయకండి.. చిన్నదే కానీ.. బోలెడు బెనిఫిట్స్!

Health Benefits of Lemon: సీజన్ తో సంబంధం లేకుండా లభించే వాటిలో నిమ్మకాయ ఒకటి. ఇవి చూడటానికి గ్రీన్ లేదా ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఇది రుచికి పుల్లగా ఉంటుంది. వేసవికాలంలో నీటిలో నిమ్మరసం పిండుకుని ఉప్పు లేదా పంచదార కలుపుుకుని తాగితే ఒంట్లో ఉన్న వేడి అంతా పోతుంది. ఇంకా దీంతో పులిహోర, పచ్చడి వంటివి చేసుకోవచ్చు. 

కరోనా సమయంలో ప్రజలు నిమ్మకాయ వాడకం పెంచారు. వైద్యులు కూడా నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగమని చెప్పేవారు. ఎండాకాలంలో ప్రజలు నిమ్మకాయ నీళ్లు ఎక్కువగా తాగుతారు. దీనినీ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. నిమ్మకాయతో చాలా వ్యాధులు దూరమవుతాయి. నిమ్మకాయ ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం. 

నిమ్మకాయ ప్రయోజనాలు
** రోజూకు రెండు మూడు సార్లు నిమ్మరసం రోజూ తాగితే బరువు తగ్గుతారు. 
** నిమ్మకాయ స్కిన్ కు నిగారింపు ఇవ్వడంతోపాటు మచ్చలను కూడా తొలగిస్తుంది.
** లెమన్ యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
** నిమ్మ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రాదు. అంతేకాకుండాఇది పచ్చకామెర్లును తగ్గిస్తుంది. 

Also Read: Guava Health benefits: జామ పండు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?

** మలబద్దకం, ఆజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాకుండా ఊబకాయన్ని కూడా తగ్గిస్తుంది. 
** నిమ్మరసం తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ కు గురికాకుండా ఉంటుంది.
** కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో నిమ్మరసం తోడ్పడుతుంది. 
** నిమ్మలో మెగ్నీషియం ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
** జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. 

Also Read: Summer drinks: వేసవిలో మీ ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ డ్రింక్స్ తాగండి చాలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News