Sunflower Seeds Benefits: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. కొలెస్ట్రాల్ ని నియంత్రించడానికి మంచి జీవన శైలిని అనుసరించడం అవసరం.ఈ సమస్య నుండి బయట పడడానికి కొంత మంది అల్లోపతి మందులను ఉపయోగిస్తారు. మరికొంత మంది ఇంటి చిట్కాలను పాటిస్తారు. ఇంట్లో వాడే చిట్కాలతో పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కూడా ఒకటి. పొద్దు తిరుగుడు గింజల వల్ల శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. కాబట్టి పొద్దు తిరుగుడు గింజలను ఉపయోగించి శరీరంలో చేదు కొవ్వును తగ్గించే విధానం గురించి తెలుసుకుందాం.
పొద్దుతిరుగుడు విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు
ఆయుర్వేదం శాస్త్రంలో పొద్దుతిరుగుడు విత్తనాలను చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక గుణాలను కలిగి ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెరుగుదలను నియంత్రించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.
పొద్దుతిరుగుడు విత్తనాల ఉపయోగం
పొద్దుతిరుగుడు విత్తనాలను ఉదయం తినడం మంచిది. పొద్దుతిరుగుడు పువ్వుల గింజలను ఓట్స్, గంజి లేదా సలాడ్‌లో కలుపుకుని రోజూ తినడం వలన ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి. అలా కాకుండా ఈ పొద్దు తిరుగుడు గింజలను వేయించి కూడా తినవచ్చు.
Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు
మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిలో
- మొదటిది, మీ దవడలు మరియు చేతుల్లో నొప్పి ఉంటుంది.
- ఇది కాకుండా, చెమట ఎక్కువగా ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది కూడా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనపడే ప్రథమ లక్షణం.
- కొన్నిసార్లు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం