White Hair Blackening Tips: వైట్ హెయిర్ సమస్య బాధిస్తోందా..ఈ ఆకులతో ట్రై చేస్తే వారాల్లోనే నల్లబడటం ఖాయం

White Hair Blackening Tips: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కన్పించే మరో ప్రధాన సమస్య తెల్ల జుట్టు. ప్రస్తుతం తక్కువ వయస్సులోనే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఇప్పటివరకూ చాలా చిట్కాలు ప్రయత్నించి ఉంటారు. ఇప్పుడీ చిట్కా పాటించి చూడండి..అధ్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2022, 06:11 PM IST
White Hair Blackening Tips: వైట్ హెయిర్ సమస్య బాధిస్తోందా..ఈ ఆకులతో ట్రై చేస్తే వారాల్లోనే నల్లబడటం ఖాయం

White Hair Blackening Tips: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కన్పించే మరో ప్రధాన సమస్య తెల్ల జుట్టు. ప్రస్తుతం తక్కువ వయస్సులోనే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఇప్పటివరకూ చాలా చిట్కాలు ప్రయత్నించి ఉంటారు. ఇప్పుడీ చిట్కా పాటించి చూడండి..అధ్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి..

ప్రస్తుతం చాలామందిలో ప్రధానంగా కన్పించే సమస్య వైట్ హెయిర్. రోజూ ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటీ వైట్ హెయిర్ కారణాలే. తెల్ల జుట్టు అనేది యువతీ యువకులకు ప్రధాన సమస్యగా మారింది. వైట్ హెయిర్ సమస్య నుంచి ఉపశమనం కోసం కెమికల్ కూడిన హెయిర్ డై వినియోగిస్తే..జుట్టు మరింత పాడవుతుంది. ఇప్పటివరకూ చాలా రకాల చిట్కాలు పాటించి ఉంటారు. ఇప్పుడీ అద్భుతమైన చిట్కా పాటించి చూడండి. కొన్ని రోజుల్లోనే ఫలితం కన్పిస్తుంది. 

చింత ఆకులు

మీకు తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంటే..చింతచెట్టు ఆకులు మంచి ఫలితాల్నిస్తాయి. చింత ఆకుల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ ఇందుకు దోహదపడతాయి. చింత ఆకుల వల్ల కేవలం జుట్టు ఆరోగ్యంగా మారడమే కాకుండా...ఇతర చాలా అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డేండ్రఫ్ గుణాలు బాగా ఉపయోగపడతాయి. జుట్టును ఆరోగ్యంగా మార్చేందుకు, తెల్లజుట్టు నల్లబడేందుకు చింతాకులతో హెయిర్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దీనిని స్ప్రే గా తయారు చేసుకోవచ్చు.

చింతాకులతో స్ప్రే, ప్యాక్

స్ప్రే తయారు చేసేందుకు ముందుగా ఒక గిన్నెలో 5 కప్పున నీరు తీసుకుని..అరకప్పు చింతాకులు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఉడికించాలి. చల్లబడిన తరువాత హెయిర్‌కు స్ప్రే చేసుకోవాలి. కొద్దిసేపు ఉంచి శుభ్రమైన నీళ్లలో కడిగేయాలి.

ఇక హెయిర్ ప్యాక్ తయారు చేసేందుకు కొన్ని ఆకుల్ని పెరుగుతో కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టులో రాస్తూ నెమ్మదిగా మస్సాజ్ చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 

చింతాకుల్లో సహజసిద్దమైన హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి.కేవలం కొన్ని వారాలు వాడటం వల్ల మీ తెల్లజుట్టు నల్లబడటమే కాకుండా..హెయిర్ ఫాల్, జుట్టు ఎండిపోవడం, బలహీనంగా ఉండటం వంటి సమస్యలన్నీ దూరమౌతాయి.

Also read: Weight Loss Tips: ఆ నాలుగు అలవాట్లు మార్చుకుంటే..నెలలోనే బరువు తగ్గడం ఖాయం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News