Hair care in rainy season: వర్షాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు.. గొడుగు తీసుకోవడం మరిచిపోవచ్చు. ఈ క్రమంలో వర్షంలో తడవడం వల్ల.. మీ జుట్టుకు చాలా ప్రమాదకరం. రెయిన్ కోట్ ఉన్నా కూడా వర్షపు నీరు హుడీల కింద చేరుకుని, ఎక్కువసేపు తడిగా ఉండి జుట్టుకి, కుదుళ్లకు నష్టం కలిగిస్తాయి.
వర్షంలో తడవడం మీ జుట్టుకు హానికరం. ఎందుకంటే వర్షపు నీటిలో కాలుష్యాలు ఉంటాయి, ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. ఇది పొడి జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది. వర్షపు నీటి కారణంగా జుట్టు పొడిగా మారడం, రాలడం, వంటివి ఎక్కువగా జరుగుతాయి.
ఒకవేళ వర్షంలో తడిసిన కూడా వర్షం నీటివల్ల మన జుట్టును ఎలా కాపాడుకోవాలో చూద్దాం..
జుట్టుని బాగా శుభ్రపరచడం:
మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు, కుదుళ్లను సరిగా శుభ్రపరచడం అవసరం. టాక్సిన్లను తొలగించడానికి డిటాక్స్ చేసే లక్షణాలు ఉన్న షాంపూ వాడండి. దాని వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది.
కండిషనర్ వాడడం:
పొడిబారిన జుట్టును తొలగించడానికి, మీ జుట్టును స్మూత్ చేయడానికి.. కండిషనర్ కు వాడడం మంచిది. ముఖ్యంగా ఆర్గాన్ ఆయిల్ జుట్టును స్మూత్ గా చేస్తుంది.
జుట్టు ఆరబెట్టడం:
మీ జుట్టు తడిగా ఉన్నప్పుడు, టవల్‌తో బాగా ఆరబెట్టండి. సమయం ఉంటే, సహజంగా ఆరనివ్వండి. లేకపోతే, తక్కువ వేడితో బ్లో డ్రై వాడండి.
స్టైలింగ్ కి నో చెప్పండి:
మీ జుట్టు బాగా పొడిగా ఉంటే.. ఎక్కువగా స్టైలింగ్ చేయకుండా ఉండడం బెటర్. ఎక్కువ స్టైలింగ్ చేయడం వల్ల జుట్టు అంచులు పొడిబారిపోతాయి.
పోషకాహారాన్ని తీసుకోండి:
మీరు తీసుకునే ఆహారం మీ జుట్టు పై నేరుగా ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం మీ జుట్టును ఆరోగ్యకరంగా మార్చి మెరిసేలా చేస్తుంది. వర్షాకాలం లో వేడిగా, క్రిస్పీ గా ఉండే ఆహారాలను తినాలనుకోవచ్చు, కానీ ఇవి మీ జుట్టు కు కూడా హాని చేస్తాయి. అందువల్ల.. జంక్ ఫుడ్‌ను దూరంగా ఉంచి.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రోటీన్, విటమిన్‌లతో కూడిన ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. జుట్టు పెరుగుదలకు బెర్రీలు, వేరుశెనగలు, చిలగడదుంపలు వంటివి బాగా ఉపయోగపడతాయి.
వాతావరణ మార్పులు మీ జుట్టుపై ప్రభావం చూపడం సహజమే, కానీ జుట్టు సంరక్షణ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ జుట్టును ఆరోగ్యకరంగా ఉంచవచ్చు.
Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter