Gongura Pappu Recipe: గోంగూర పప్పు ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, దీనిలో పుల్లని గోంగూర ఆకులతో కలిపి పప్పు ఉడికించబడుతుంది. ఇది వేడి అన్నం, రాగి ముద్దతో కలిసి చాలా రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు:
* 1 కప్పు కందిపప్పు
* 1 కట్ట గోంగూర
* 1 పెద్ద ఉల్లిపాయ
* 4 టమోటాలు
* 15 పచ్చి మిరపకాయలు
* 1/2 స్పూన్ పసుపు
* రుచికి సరిపడా ఉప్పు
* 10 వెల్లుల్లి రెబ్బలు
* కొత్తిమీర తరుగు
* 1/2 స్పూన్ ఆవాలు
* 1/2 స్పూన్ జీలకర్ర
* 2 ఎండు మిరపకాయలు
* 2 కరివేపాకు రెబ్బలు
* నూనె
తయారీ విధానం:
1. కందిపప్పును శుభ్రం చేసి, నీటిలో నానబెట్టుకోండి.
2. గోంగూర ఆకులను శుభ్రం చేసి, తుంటి భాగాన్ని తొలగించి, చిన్న ముక్కలుగా కోసుకోండి.
3. ఉల్లిపాయ, టమోటాలు, పచ్చి మిరపకాయలను సన్నగా తరిగిపెట్టుకోండి.
4. ఒక కుక్కర్ లో నానబెట్టిన పప్పు, గోంగూర ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, టమోటాలు, పచ్చి మిరపకాయలు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర తరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె, 3 గ్లాసుల నీరు వేసి మూత పెట్టుకోండి.
5. కుక్కర్ ను ఎక్కువ మంట మీద ఉంచి 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
6. ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
7. తరువాత, తరిగిన ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, కరివేపాకు రెబ్బలు వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
8. ఈ పోపును ఉడికిన పప్పులో కలిపి, బాగా కలపాలి.
9. గోంగూర పప్పు వేడి వేడి అన్నం, రాగి ముద్దతో కలిసి సర్వ్ చేయండి.
గోంగూర పప్పు ఆరోగ్య ప్రయోజనాలు:
* గోంగూరలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది విటమిన్ A, C, ఐరన్, కాల్షియం యొక్క మంచి మూలం.
* గోంగూర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
* ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
* గోంగూర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.
ఇన్ని పోషకాలు ఉన్న ఈ ఆకును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి.కాబట్టి మీరు కూడా ఈ డిష్‌ను ట్రై చేయండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి