Uric Acid Control 1 Day With Diet Plan: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుదల వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మూత్రపిండం యూరిక్ యాసిడ్‌ను సరిగ్గా ఫిల్టర్ చేయడంలో విఫలం కావడంతో ఇలాంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా చాలా మందిలో ఎముకల కీళ్లపై స్ఫటికాల రూపంలో గడ్డకట్టి పాదాలలో వాపు, కీళ్ల నొప్పుల వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో ప్యూరిన్, జీర్ణక్రియలో సమస్యలు వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
వాల్‌నట్స్‌తో యూరిక్ యాసిడ్‌కు చెక్:
వాల్‌నట్స్‌ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ వాల్‌నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
వాల్నట్ ఎలా పని చేస్తుంది?
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా భాస్వరం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన పోషకాలు కూడా లభిస్తాయి. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రోజూ ఎంత వాల్‌నట్ తినాలి?
ప్రతి రోజూ 3 నుంచి 4 నాలుగు మీడియం సైజ్ వాల్‌నట్‌లను తింటే, యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ డ్రై ఫ్రూట్‌ని నేరుగా తినవచ్చు లేదా స్మూతీ, షేక్ లేదా సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని నానబెట్టి జ్యూస్‌లా చేసుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?
Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి