Uric Acid Diet: శరీరంలో ప్యూరిన్ అనే రసాయనానం విచ్ఛిన్నం కావడంలో యూరిక్ యాసిడ్ విడుదలవుతుంది. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది సాధారణంగా రక్త నాళాల ద్వారా మూత్రపిండాలకు చేరుకుంటుంది. అంతేకాకుండా శరీరం నుంచి మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. దీని కారణంగా గౌట్ సమస్య వస్తాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు మోకాళ్లు, శరీరంలో పేరుకుపోయి.. చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంగా తీసుకోండి:
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్‌ల ఉత్పత్తిని తగ్గించేందుకు సహాయపడుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి ఉంటుంది.
గుమ్మడికాయ:
యూరిక్ యాసిడ్ తగ్గించడానికి..ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా వోట్స్, తృణధాన్యాలు, బ్రోకలీ, సెలెరీతో పాటు గుమ్మడికాయను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఆరెంజ్ పండ్లు:
బత్తాయి, నిమ్మకాయల్లో శరీరానికి కావాల్సిన విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వాటిని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరానికి విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది.
టొమాటో:
విటమిన్ సి పుష్కలంగా టొమాటోల్లో అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ టొమాటో రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్
Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి