Valentines Day Outing Ideas: వాలెంటైన్స్ డే వచ్చేసింది.. ప్రస్తుతం పెళ్లయిన వారు అలానే పెళ్లి కాని వారు కూడా ఈరోజు తమకు ఇష్టమైన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. పెళ్లయిన వారైతే సరే కానీ పెళ్లి కానీ వారికి మాత్రం తమకు ఇచ్చిన గిఫ్ట్ ఎవరికి తెలియకుండా ఎలా దాచిపెట్టుకోవాలి అనే సమస్య తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తే చుట్టుపక్కల వాళ్లంతా ఇది ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటారు. అందుకే ఈ గిఫ్ట్ ఐడియాలు ఫాలో అయితే.. ఈ సమస్య ఉండదు.
రోజా చెట్టు
రోజా పూలు ఇచ్చే బదులు మీ లవర్ కి రోజా చెట్టు కానీ ఇచ్చినట్లయితే.. అది హ్యాపీగా వాళ్ళు ఇంటి ముందు పెంచుకోవచ్చు. ఈ గిఫ్ట్ దాచి పెట్టే అవసరం లేదు.. అంతేకాకుండా ఆ చెట్టుని రోజు చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తూ ఉంటారు.
క్యాండిల్ లైట్ డిన్నర్
ఒక మంచి రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేసుకొని ఎంచక్కా ఫోటోలు తీసుకుంటే చాలు.. ఆ ఫోటోలు ఎప్పటికీ గుర్తుంటాయి. మరో విషయం ఏమిటి అంటే ఈ ఐడియా వస్తువు కాదు కాబట్టి ఎక్కడ దాచి పెట్టుకోవాలని ఆలోచన కూడా ఉండదు.. అంతేకాకుండా వాలెంటైన్స్ డే కి తప్పకుండా రెస్టారెంట్ లో ఆఫర్స్ ఉంటాయి కాబట్టి.. ఖర్చు కూడా పెద్దగా అవ్వదు.
డొనేషన్
ప్రేమను ప్రేమతోనే జరుపుకోండి. ముసలివారికైనా ..అనాధ పిల్లలకైనా.. మీకు తోచినంత సహాయం చేయండి. కొన్ని ఆర్గనైజేషన్ మీరు చేసిన సహాయానికి గుర్తింపుగా గ్రీటింగ్ కార్డులు కూడా ఇస్తాయి.
టైమ్
గిఫ్ట్ లు ఏమీ అవసరం లేదు.. కొంచెం ప్రశాంతమైన టైం ఒకరితో ఒకరు స్పెండ్ చెయ్యండి. ఎలాంటి గొడవలు చిరాకులు.. లేకుండా ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించండి. మీరు రోజు ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తున్నా.. ఈరోజు మరింత ప్రత్యేకంగా ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి.. అది కూడా ఒక రకమైన గిఫ్ట్ ఏ కదా మరి
Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు.. కేటీఆర్, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి
Also Read: KTR Viral Tweet: శభాష్ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్ ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook