Hair Care Tips: మీరు అనుకొని ఉంటారా.. వీటిని తింటే కేవలం 14 రోజుల్లో జుట్టు పెరుగుతుందని..?

Vegetables For Hair Growth In 14 Days: దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం ఆహారాల్లో క్రమం తప్పకుండా కూరగాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును ఒత్తుగా చేయడమేకాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 02:44 PM IST
  • దృఢమైన, ఒత్తైన జుట్టు కోసం ఇలా చేయండి.
  • ప్రతి రోజూ ఆహారంలో క్యారెట్ తీసుకోండి
  • బచ్చలికూర కూడా తీసుకోండి
Hair Care Tips: మీరు అనుకొని ఉంటారా.. వీటిని తింటే కేవలం 14 రోజుల్లో జుట్టు పెరుగుతుందని..?

Vegetables For Hair Growth In 14 Days: ప్రతి ఒక్కరూ దృఢమైన, ఒత్తైన జుట్టును కోరుకుంటారు. కానీ ఆధునిక జీవన శైలిన కారణంగా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది చిన్నవయసులోనే జుట్టు నెరసిపోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కేట్‌లో లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ని వినియోగిస్తున్నారు. అయితే వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా కొన్ని ఇంటి నివారణలు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆహారంలో భాగంగా  కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం ఎలాంటి కూరగాలయలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వెంట్రుకలు పెరగకపోతే ఈ కూరగాయలను తినండి:
బీన్స్:

పొడవాటి, బలమైన జుట్టు పొందడానికి బీన్స్ తీసుకోవడం చాలా ఉత్తమమని ఆయుర్వేద నిపుణుల తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఐరన్, బయోటిన్, ఫోలేట్, అనేక ముఖ్యమైన విటమిన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలు ఉంటే వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.     

బచ్చలికూర:
జుట్టు ఒత్తుగా, దృఢంగా ఉండేందుకు బచ్చలికూర తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ కూరను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టడమేకాకుండా జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.   

క్యారెట్:
క్యారెట్‌లో ఉండే పోషకాలు జుట్టును ఒత్తుగా చేయడమేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్ (విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఐరన్) వంటి పోషకాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలపై ప్రభావవంతంగా కృషి చేస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News