Vitamin E and coconut oil: కొబ్బరి నూనె, విటమిన్ ఇ రెండూ జుట్టు సమస్యలను తగ్గించడమేకాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ సమ్మేళనాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా విటమిన్ ఇ కూడా ముఖంపై ముడతలను తగ్గించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఫేస్‌పై రంధ్రాలను శుభ్రపరుచుతుంది. అంతేకాకుండా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే కొబ్బరి నూనె, విటమిన్ ఇ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. క్లెన్సర్‌గా పనిచేస్తుంది:
కొబ్బరి నూనెను సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా వినియోగిస్తారు. ముఖంపై చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి కొబ్బరినూనెలో విటమిన్ ఇ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.. చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.
2. మాయిశ్చరైజర్:
కొబ్బరి నూనె, విటమిన్ ఇ కలిపిన మిశ్రమాన్ని మాయిశ్చరైజర్‌గా కూడా వినియోగించవచ్చు. విటమిన్ ఇలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మానికి రక్షణ, పోషణను అందిస్తాయి. అంతేకాకుండా చర్మంలోని తేమను లాక్ చేయడంతో పాటు లోపలి నుంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
3. ముఖంపై గ్లో పెంచుతుంది:
ముఖం కాంతిని పెంచడానికి కొబ్బరి నూనె, విటమిన్ ఇని వినియోగించవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా టాక్సిన్స్ తొలగిపోయి..చర్మంలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. కాబట్టి తరుచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook