Weight Loss Tips: బరువు తగ్గే వారు ఇలా చేస్తే.. వారంలోనే బరువు తగ్గడం ఖాయం..!

Weight Loss In 7 Days: బరువు తగ్గడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అయితే శరీర బరువును నియంత్రించేందుకు చాలా రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం వంటి నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని నిపుణుల చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 11:06 AM IST
  • బరువు తగ్గే క్రమంలో ఇలా చేయండి
  • చక్కెర, కార్బోహైడ్రేట్లతో తయారు చేసి ఆహారం తినొద్దు
  • ఇలా చేస్తే వారంలోనే బరువు తగ్గడం ఖాయం
Weight Loss Tips: బరువు తగ్గే వారు ఇలా చేస్తే.. వారంలోనే బరువు తగ్గడం ఖాయం..!

Weight Loss In 7 Days: బరువు తగ్గడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అయితే శరీర బరువును నియంత్రించేందుకు చాలా రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం వంటి నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని నిపుణుల చెబుతున్నారు. అయితే పలు నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం ఆహారంలో చిన్న మార్పులు చేస్తే.. బరువు తగ్గడం మరింత సులభతరమవతుందని పేర్కొన్నాయి. కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారు నివేదికల్లో పేర్కొన్న పలు నియమాలను తప్పకుండా పాటించాలి. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..   

ఈ నియమాలు తప్పకుండా పాటించాలి (These Rules Must Be Followed For Weight Loss):

బరువు తగ్గాలనుకునే వారు పెద్దగా లక్ష్యం పెట్టుకో కూడదు. ఎందుకంటే మీరు ఆ నియమాలు పాటించకపోతే మీ పై ఒత్తిడి మొదలవుతుంది. కావున మీరు కేవలం 5 కిలోల బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడు మీరు 2 కిలోలు మాత్రమే బరువు తగ్గుతారు.

చక్కెర, కార్బోహైడ్రేట్లతో తయారు చేసి ఆహారం తినొద్దు (Sugar And Carbohydrates):

వైట్ బ్రెడ్, పాస్తా, నూడుల్స్, ఇతర ప్యాక్ చేసిన ఆహారాలు తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఫైబర్, సూక్ష్మపోషకాలు తక్కువగా ఉన్నం గింజలు లేదా గోధుమ రంగు ఆహారాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆకు కూరలను తినండి (Eat green vegetables):

చాలా మందకి బరువు తగ్గే క్రమంలో ఆకు కూరలను తినడం మర్చిపోతారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా కరివేపాకు, ఒరేగానో, పార్స్లీ, కొత్తిమీర, బచ్చలికూర మొదలైన కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరగుపడి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌న్‌ నియంత్రిస్తుంది.  

బరువు తగ్గే క్రమంలో ప్రోటిన్లు చాలా అవసరం (Proteins are essential for weight loss):

బరువు తగ్గే క్రమంలో శరీరానికీ ప్రోటిన్లు చాలా అవసరమవుతాయి. అయితే ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల జీవక్రియ శక్తి పెరగడమే కాకుండా బరువు నియంత్రిస్తుంది. అయితే వీటిని కేవలం వారానికి ఒకే సారి తినాలని నిపుణులు చెబుతున్నారు.

పుష్కలంగా నీరు తాగాలి (Drink plenty of water):

శరీరం హైడ్రేటెడ్‌గా ఉండడానికి నీరు అధికంగా తీసుకోవాలి. నీరు రోజూ అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రోజూ భోజనానికి 15 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి.

ఎక్కువగా నడవండి (Walk more):

అదనపు కేలరీలను బర్న్ చేయడానికి ప్రతిరోజూ తిన్న తరువాత 20 నుంచి 25 నిమిషాల పాటు నడవండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న అదనపు కేలరీలు బర్న్‌ అవుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read:  Weight loss In 5 Days: ఎన్ని చిట్కాలు పాటించిన బరువు తగ్గలేకపోతున్నారా.. అయితే ఇలా సుభంగా 5 రోజుల్లో క్యాబేజీతో బరువు తగ్గండి..!

Also Read:  Weight loss tips in 10 days: వీటితో తయారు చేసిన రొట్టెలను తింటే పది రోజుల్లో బరువు తగ్గుతారు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News