Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తప్పక తింటే మీ రక్తంలో షుగర్ పెరగదు!

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్తి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. కాబట్టి దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 11:53 AM IST
Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తప్పక తింటే మీ రక్తంలో షుగర్ పెరగదు!

Health tips: మనం అందరికీ అత్తిపండ్లు గురించి తెలుసు. వీటినే మన వాడుకలో భాషలో అంజీర్ ఫ్రూట్, మేడిపండు అనే పేర్లుతో పిలుస్తారు. మధుమేహ (Diabetes) వ్యాధిగ్రస్తులు అత్తి పండ్లు (Fig Fruit) తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది తినడం వల్ల కొన్ని వ్యాధులు మీ నుండి శాశ్వతంగా తొలగిపోతాయి. అయితే, రోగులు అత్తి పండ్లను తీసుకునే ముందు తప్పనిసరిగా తమ వైద్యుడిని సంప్రదించాలి. ఇది ఖచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

అత్తి పండ్లలో అద్భుతమైన పోషకాలు
డయాబెటిక్ రోగులకు అంజీర్ (Anjeer) చాలా మేలు చేస్తుంది. ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం కాకుండా, ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. వాటి సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 

అత్తి పండ్లు ఎలా పనిచేస్తాయి
అంజీర్‌లో యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఉంటుంది. మధుమేహం వల్ల శరీరంపై వచ్చే చెడు ప్రభావాలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. 

అంజీర్ పండ్లను ఇలా తీసుకోవాలి
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ డ్రై ఫ్రూట్‌ తినండి. అంతేకాకుండా దీని ఆకులతో చేసిన టీని కూడా తాగవచ్చు. అలాగే ఎండిన అత్తి పండ్లను పాలలో కలిపి తాగవచ్చు. దీని కోసం, ఎండిన అత్తి పండ్లను పాలలో సుమారు 4-5 గంటలు నానబెట్టండి. దీనిని మీరు రాత్రి పడుకునే ముందు త్రాగవచ్చు. మీరు అత్తి పండ్లను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటే మంచిది.

Also Read: Lady Finger Benefits: ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది.. మీరు కూడా తాగండి.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News