White Hair Home Remedies: నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడానికి వివిధ రకాల ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రొడెక్ట్స్లోని కెమికల్స్ జుట్టును మరింత బలహీనంగా తయారు చేస్తాయి.
అయితే చిన్నవయసులోనే తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? అయితే జుట్టు తెల్లబడటాన్ని కారణాలు ఎంటి? అనే విషయాల పై మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లజుట్టు అనేది సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది దీని ఒక వ్యాధి ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తారు.
జుట్టు తెల్ల బడటం అనేది వ్యాధికి సంకేతాలు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని పలు కరణాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అధిక కెమికల్స్ కలిగిన షాంపూలను, కండీషనర్స్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు తెల్లగా మారుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా సల్పేట్తో తయారు చేసిన పదార్థాల కారణంగా జుట్టు పొడిబారడం, రాలిపోవడం, నెరిసిపోతుంది.
అంతేకాకుండా నేటి కాలం యువత హెయిర్ కలరింగ్ ట్రెండ్ ను పాటిస్తుంది. దీనిలో ఉపయోగించే రంగులు, కెమికల్స్ వల్ల జుట్టు తర్వగా రాలిపోవడం, పాడుకావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా జుట్టును దెబ్బతీస్తుంది.
శరీరంలో విటమిన్ డి, బీ12, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన కూడా తెల్లజుట్టు వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కూడా జుట్టు తెల్లగా మారుతుంది.
తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి.
మీ ఆహారంలో పప్పులు, పాల ఉత్పత్తులు, పచ్చి కూరగాయలను ఉండేలా చూసుకోవాలి.
ప్రస్తుతం ఉన్న ఒత్తిడి కారణంగా చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యల బారిన పడుతున్నారు.
శరీరానికి కావాల్సిన నిద్ర పోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు పైన చెప్పిన విధంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter