మలేషియాలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Last Updated : Nov 7, 2017, 11:42 AM IST
మలేషియాలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్లి హాయిగా గడపాలని అనుకుంటారు. వారం పదిరోజులు వస్తే ఏదైనా సుదూర పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి గడిపి రావాలనుకుంటాము. ఇలా పర్యటనలంటే ఇష్టపడేవారు తప్పనిసరిగా చూడవలసిన  దేశం మలేషియా. భారతీయులు, చైనీయులు, మలయాలు ఎక్కువగా ఈ దేశంలో కనిపిస్తారు. 

మలేషియాలో ప్రధాన మతం ఇస్లాం. పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో ఈ దేశం ఆసియా ఖండంలోనేకాక యావత్ ప్రపంచంలో ఆర్థికప్రగతిని సాధిస్తోంది. సాధారణంగా మలేషియా పర్యటనకు ఎవరు వెళ్లి వచ్చిన ఇస్లాం మతం గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయడం మంచింది కాదు అని అంటుంటారు. ఈ దేశ రాజధాని కౌలాలంపూర్. 

మలేషియా దేశంలో చేయాల్సినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

* షేక్‌హ్యాండ్‌లు ఇవ్వద్దు

మలేషియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే  వెంటనే షేక్‌హ్యాండ్‌ ఇవ్వటం మంచిది కాదట. ముస్లిములు ఎక్కువగా ఉండే ఈ దేశంలో  మహిళలకు షేక్‌హ్యాండ్‌ ఇస్తే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కనుక కొత్తవారు కనిపిస్తే నమస్కారం పెట్టడం మంచిది. 

* పొట్టి దుస్తులు నిషేధం

మలేషియాలో ప్రార్థనా స్థలాలను సందర్శించేటప్పుడు దుస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.  మినీ స్కర్టులు, పొట్టి దుస్తులు, ఒళ్ళు కనిపించే విధంగా దుస్తులు వేసుకోకూడదు.
 
* లోకల్‌ ఫ్లేవర్స్‌ బెస్ట్‌

మలేసియాలో ఎక్కడికి వెళ్లినా  స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ కనిపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ తక్కువ ధరకు, రెస్టారెంట్ ఫుడ్ ఎక్కువ ధరకు లభిస్తాయి. పర్యాటకులు సాధారణంగా స్ట్రీట్‌ ఫుడ్‌ కన్నా రెస్టారెంట్ ఫుడ్ కే మొగ్గుచూపుతారు. కానీ మలేసియాలో స్ట్రీట్‌ఫుడ్‌ వైపు మొగ్గు  చూపితేనే మంచిది. చాలా మంది స్థానికులు లోకల్ ఫుడ్ నే తింటుంటారు. టేస్టీగా, యమ్మీగా ఉంటుందనీ..!

 
* మీటర్‌ వేశాకే

మలేసియాలో మన హైదరాబాద్ ఆటోలకు ఉన్నట్లు అక్కడి టాక్సీలకూ మీటర్లు ఉంటాయి. కానీ డ్రైవర్లు మాత్రం వీటిని ఉపయోగించరు. దీని వల్ల ప్రయాణికులు ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల టాక్సీ ఎక్కే సమయంలో మీటర్‌ వేశారా? లేదా? అని గుర్తుంచుకోవాలి. 
 
* హద్దుల్లో ఉండాలి

మలేషియా సందర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకోవాలి. ఒకరినొకరు కౌగిలించుకోవటం, ముద్దులు పెట్టుకోవటం నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలను తెలియజేసే బోర్డులు బహిరంగ ప్రదేశాల్లో అన్ని చోట్లా కనిపిస్తాయి. 

* టాయిలెట్స్ తక్కువ 

మలేషియాలో ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేయరాదు. అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యం కూడా బాగా తక్కువ. కొన్ని మాల్స్‌లో మాత్రమే టాయిలెట్స్‌ ఉంటాయి. వీలైతే హోటల్ రూమ్స్ లోనే అన్నీ ముగించుకొని బయటకు వెళ్ళండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ..!  

Trending News