White Hair To Black Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? వారంలో మూడు రోజులు వీటిని తినండి చాలు..

White Hair To Black Hair Naturally: తెల్ల జుట్టుతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 04:45 PM IST
White Hair To Black Hair: తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? వారంలో మూడు రోజులు వీటిని తినండి చాలు..

 

White Hair To Black Hair Naturally: ప్రస్తుతం చాలామందిలో తెల్ల జుట్టు ఒక్కసారిగా పెరిగిపోతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా చిన్న వయసులో ఉన్నప్పటికీ వృద్ధాప్య వయసులో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా తెల్ల జుట్టు కారణంగా ముఖం కూడా అందహీనంగా తయారవుతోంది. చాలామందిలో ఈ సమస్య శరీరంలోని పోషకాహార లోపం కారణంగా కూడా వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన హెయిర్ కేర్ ప్రొడక్షన్ వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు ఐరన్ రిచ్ పాలకూరను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఉండే గుణాలు కుదుళ్లకు సరైన ఆక్సిజన్ అందించేందుకు కృషి చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రంగును మెరుగుపరిచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తెల్లజుట్టుతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో పాలకూరను తీసుకోవాల్సి ఉంటుంది.

తెల్ల జుట్టుతో బాధపడే వారికి వాల్ నట్స్ కూడా ఔషధంలా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో అధిక పరిమాణంలో బయోటిన్ లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా వాల్ నట్స్ తీసుకోవడం వల్ల జుట్టు కణాల నుంచి బలోపేతం అవుతుంది. అంతేకాకుండా తెల్ల రంగులో ఉన్న జుట్టు సులభంగా నల్ల రంగులోకి మారుతుంది. 

ఉసిరి కూడా జుట్టును దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతే కాకుండా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రోత్సహిస్తుంది. దీనికి కారణంగా బూడిద జుట్టు తెల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

తెల్ల నువ్వులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి వీటిలో ఐరన్ జింక్ పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి తెల్ల నువ్వులను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల జుట్టులోని మెలానిన్ ఉత్పత్తులు పెరుగుతాయి. దీనికి కారణంగా జుట్టు రాలడం తెల్ల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

కరివేపాకులో ఇలాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులను మిశ్రమంలా తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవడం వల్ల కుదుళ్ల నుంచి జుట్టు దృఢంగా మారుతుంది. కాబట్టి తెల్ల జుట్టుతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. స్వీట్ పొటాటో కూడా తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు తెల్ల జుట్టు ఉన్నవారు ప్రతిరోజు స్వీట్ పొటాటో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంతేకాకుండా జుట్టు దృఢంగా తయారవుతుంది.

Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News