Melon Health Benefits: ఖర్బూజ పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Winter Melon Health Benefits: ఖర్బూజ పండు ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాల రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2023, 03:21 PM IST
Melon Health Benefits: ఖర్బూజ పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Winter Melon Health Benefits: ఖర్బూజ పండులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని శీతాకాలంలో తినడం వల్ల శరీరానికి పోషకాలు లభించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ఖర్బూజలో కేలరీలు, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల తక్కువ పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఈ విటమిన్ చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  ఖర్బూజ పండును తీసుకోవాల్సి ఉంటుంది.

ఖర్బూజ పండు 4 ఆరోగ్య ప్రయోజనాలు:
ఆరోగ్యకరమైన జీర్ణక్రియ:

ఖర్బూజ పండులో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

యాంటీ-ఆక్సిడెంట్స్‌:
పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు ఖర్బూజ పండులో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి సెల్స్‌ డ్యామేజ్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లను తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
ఖర్బూజ పండులో అధిక స్థాయిలో పొటాషియం, విటమిన్ సి లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును తగ్గించి.. రక్త హీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
శీతాకాలంలో ఖర్బూజ పండును తినడం వల్ల విటమిన్ సి, రిబోఫ్లేవిన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.

Also Read: Ram Charan counter: ఆయన్ని ఏమన్నా అంటే ఆయన ఊరుకుంటారేమో, వెనకాల ఉండే మేము ఊరుకోం!

Also Read: Nandamuri Taraka Ratna Health: నందమూరి అభిమానులకు షాక్.. తారకరత్నకు మరో అరుదైన వ్యాధి గుర్తింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News