ప్రపంచంలోనే బుల్లి ఉడుత

Last Updated : Nov 6, 2017, 01:49 PM IST
ప్రపంచంలోనే బుల్లి ఉడుత

ఇండోనేషియా శాస్త్రవేత్తలు బోర్నియో వర్ష అడవిలో ప్రపంచంలోనే అతి చిన్న ఉడుతను  పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధికారులు జకార్తాలో వెల్లడించారు. 

దక్షిణ కలిమంతన్ రాష్ట్రంలోని మెరటస్ పర్వతశ్రేణిలో కనిపించిన ఈ ఉడుత శాస్త్రీయ నామం బోర్మీన్ లేదా పిగ్మీ ఉడుత లేదా ఎక్సిలిస్కిర్స్ ఎక్సిలిస్ అని జిన్హువా వార్తా సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త పేర్కొన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటనే.. ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఈ ఉడుత కూడా ఉందట.

"సెప్టెంబర్ 16వ తేదీన కనుగొనబడిన ఈ ఉడుత 73 మిల్లీమీటర్ల పొడవు, 17 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ రకమైన జాతులు బోర్నియో ద్వీపంలో నివసిస్తాయి, ముఖ్యంగా సముద్ర ఉపరితలం కంటే 1,000 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతంలో" అని శాస్త్రవేత్త వివరించారు.

Trending News