1980 lo Radhe Krishna Review: పరువు హత్యల నేపథ్యంలో ‘1980లో రాధేకృష్ణ’ మూవీ.. మెప్పించిందా..!

1980 lo Radhe Krishna Review: గత కొన్నేళ్లుగా బంజారా భాషలో కూడా పలు సినిమాలు తెరకెక్కతున్నాయి. అందులో భాగంగా భలన్ బాంచా, గోర్ జీవన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మరో బంజారా చిత్రం 1980లో రాధే కృష్ణ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ మనసు దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 02:38 PM IST
1980 lo Radhe Krishna Review: పరువు హత్యల నేపథ్యంలో  ‘1980లో రాధేకృష్ణ’ మూవీ.. మెప్పించిందా..!

మూవీ రివ్యూ: 1980లో రాధే కృష్ణ
సంగీతం : ఎంఎల్ రాజా
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఇలియాజ్ పాషా
నిర్మాణం: ఎస్ వి క్రియేషన్స్
రైటర్: రాజేష్ మాచర్ల
డైలాగ్స్: ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్
తెలుగు పాటలు : ఎంఎల్ రాజా
బంజారా పాటలు : ఎం. శ్రీనివాస్ చౌహన్
దర్శకుడు : ఇస్మాయిల్ షేక్

ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో  ఎస్‌వీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఊడుగు సుధాకర్ నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘1980లో రాధే కృష్ణ.  ఎస్‌ఎస్ సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా నటించారు.  ఎం. ఎల్. రాజా సంగీతం అందించారు.  ఈ సినిమాని తెలుగు, బంజారా భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి.   మరి సినిమా ఎలా ఉంది? మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

వంశీ తన ఫ్యామిలీతో కలిసి  జాతర కోసం తన సొంతూరు కృష్ణలంక అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ కర్రసాము పోటీలు ఆనవాయితీగా జరుగుతూ ఉంటాయి. వంశీ కుమారుడు రాధ వాళ్ల నాన్నని కర్రసాము గురించి అడుగుతాడు. వాళ్ల ఊళ్లో కర్రసాము పోటీలో కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు)ను గెలిచే వాళ్లు ఎవరు ఉండరు. ఈ క్రమంలో ఆ కృష్ణ గురించి చెప్పడం మొదలు పెట్టడంతో 1980లో ఈ స్టోరీ షురూ అవుతుంది.  కృష్ణ(ఎస్‌ఎస్ సైదులు), వంశీ ఇద్దరు మంచి దోస్తులు. వంశీ ఎక్కువ కులం, కృష్ణ తక్కువ కులం. కానీ వాళ్ల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండవు. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అంతేకాదు ఆ స్నేహం కాలేజీ వరకు కొనసాగుతుంది. ఇక వంశీ పెదనాన్న  రాఘవయ్య ఆ ఊరికి సర్పంచ్. ఆయనకు కులంటే మక్కువ ఎక్కువ.  ఆయన కుమార్తె రాధ(భ్రమరాంబిక) వంశీ చదివే కాలేజీలో జాయిన్ అవుతుంది. అక్కడ కృష్ణతో రాధ లవ్ లో పడుతుంది. అక్కడి నుంచి అసలు కథ షురూ అవుతోంది. రాధ-కృష్ణ ప్రేమ ఫలించిందా? లేదా ఆ ఊళ్లో కుల వివక్ష వాళ్ల ప్రేమను బలితీసుకుందా? లేదా చివరకు  ప్రేమ కథ మధ్యలో మావోయిస్టులు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ సినిమాను ఇస్మాయిల్ షేక్ పూర్తి గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఒకపుడు గ్రామాల్లో కులాల మధ్య ఉన్న హెచ్చు తగ్గుల వల్ల ప్రేమికులు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసారు.  ప్రతి మనిషిలో ఈ కుల పిచ్చి లేకుండా ఎలా మార్పు తీసుకురావాలి అనే అంశం నేపథ్యంలో  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  గతంలో కూడా చాలా సినిమాలు గ్రామీణ నేపథ్యంలో వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. ఆ రూట్లోనే తెరకెక్కిన చిత్రం ‘1980లో రాధకృష్ణ’.  ఈ చిత్రంలో అందమైన ప్రేమకథను తెలియజేస్తూనే.. అంతర్లీనంగా కుల వివక్ష నిర్మూలన గురించి, పరువు హత్యల నిర్మూమలన గురించి ప్రస్తావించడం యువతకు మంచి సందేశాన్ని ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా  సరదా సరదగా సాగిపోయే ప్రేమకథలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ మొదలవుతోంది. ఇక సెకెండాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు అడవిలో అన్నలు.. మరోవైపు వాళ్లను వేటకుక్కల్లా  వెంటాడే పోలీసులు. వీరిద్దరి మధ్యలో స్వచ్ఛమైన ప్రేమను కాపాడుకోవడం కోసం ప్రేమికుల  పోరాటాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు.

కృష్ణలంక అనే గ్రామంలో డిగ్రీలు చదివుకున్న యువత కుల వివక్ష.. గ్రామంలో హెచ్చు తగ్గుల కారణంగా ఎందుకు నక్సలైట్స్ మారారు అన్న అంశాన్ని సృజించాడు దర్శకుడు.  వాళ్ల ఉద్దేశం మంచిదే కానీ వాళ్లు ఎంచుకున్న మావోయిస్ట్  మార్గం సరైనది కాదనేలా చెప్పడం దర్శకుడు పనితీరును తెలుపుతుంది. అంతేకాదు డైరెక్టర్  తన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆలోచింపజేయడంలో సక్సెస్ అయ్యాడు. హీరో కృష్ణ తన నాన్న భావాలను ఆదర్శంగా తీసుకుని కులాల నిర్మూలనకు ఏ విధంగా పాటు పడ్డాడు. అందుకు కోసం ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడనేది ఈ సినిమాలో చూపించాడు. ఒకే ఒక్క  సంఘటనతో అగ్రకులాల వారిలో మార్పు వచ్చేలా చూపించి కథను ముగించడం బాగుంది.

సాంకేతిక విశ్లేషణ:
సాంకేతికంగా ఈ సినిమా బాగా ఉంది. . దర్శకుడు షేక్ ఇస్మాయిల్ తను ఎంచుకున్న పాయింట్‌ను చక్కగా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. ఎం. రాజేష్, చరణ్, ఖమ్మం బాబు, జ్ఞానేశ్వర్, వై ఉపేందర్ అనే కుర్రాళ్లు రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.  ఎంఎల్ రాజా ఇచ్చిన సంగీతం కూడా కథకు చాలా హెల్ప్ అయింది. పాటలు బాగున్నాయి. తనే లిరిక్స్ రాసి ట్యూన్ కట్టడం వల్ల పాటలు అన్నీ చక్కగా అమరాయి. నిర్మాత ఊడుగు సుధాకర్ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను ఉన్నత విలువలతో చక్కగా నిర్మించారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

నటీనటుల విషయానికొస్తే..
హీరోగా నటించిన ఎస్ఎస్ సైదులు తన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకుడిగా, ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా  తన యాక్టింగ్ లో వేరియేషన్స్ చూపించాడు. హీరో ఫ్రెండ్‌గా వంశీ పాత్ర పోషించిన అతను కూడా మంచి నటన  కనబరిచాడు. ఇక హీరోయిన్లు భ్రమరాంబిక, అర్పిత లోహి కూడా తమ పరిధి మేరకు నటించారు.  మిగిలిన పాత్రధారులు కూడా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

చివరిగా.. కుల వివక్షత నిర్ములన పోరాటమే ‘1980లో రాధేకృష్ణ’.

రేటింగ్: 2.5/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News