Big Brother Movie Review:'బిగ్ బ్రదర్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Big Brother Movie Review:  శివ కంఠంనేని హీరోగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'బిగ్ బ్రదర్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు బిగ్ బ్రదర్ మూవీ ఉందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.  

Last Updated : May 24, 2024, 01:05 PM IST
Big Brother Movie Review:'బిగ్ బ్రదర్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

మూవీ రివ్యూ: బిగ్ బ్రదర్

నటీనటులు: శివ కంఠంనేని, శ్రీ సూర్య, ప్రీతి, ప్రియా హెగ్డే, గుండు సుదర్శన్, రాజేందర్ తదితరులు
ఎడిటర్: సంతోష్
కెమెరామెన్: ప్రకాష్
నిర్మాతలు: కే.శివశంకర్ రావు, ఆర్.వెంకటేశ్వరరావు
రచన, దర్శకత్వం: గోసంగి సుబ్బారావు

భోజ్‌పురిలో పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన తెలుగు దర్శకుడు గోసంగి సుబ్బారావు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో డైరెక్ట్ చేసిన 'బిగ్ బ్రదర్'. శివ కంఠంనేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
శివ (శివ కంఠమనేని), గౌరీ (ప్రియా హెగ్డే)లు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తుంటారు. నిశ్చితార్ధం జరిగి పదేళ్లు అయినా.. పెళ్లి చేసుకోరు. శివకు అతని తమ్ముడు సూర్య (శ్రీసూర్య) అంటే ప్రాణం. ఇతనిపై అనుకోకుండా కొంత మంది దాడి చేస్తే అన్న శివ కాపాడుతాడు. ఆ తర్వాత ఎలాంటి గొడవలకు పోవద్దని తమ్ముడికి చెబుతాడు. ఈ క్రమంలో తమ్ముడు సూర్య, పూజా (ప్రీతి)ని ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే పూజా వల్లనే తన తమ్ముడిపై దాడి జరిగిందనే విషయం తెలుసుకుంటాడు శివ. ఈ క్రమంలో తమ్ముడు ప్రేమిస్తోన్న ప్రీతి ఎవరు ? ఆమె ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? ఆమెపై ఎందుకు ఎటాక్ జరిగింది ? శివ, ప్రియా నిశ్చితార్ధం చేసుకున్న ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు ? శివ ఫ్లాష్‌ బ్యాక్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే 'బిగ్ బ్రదర్' మూవీ చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు బిగ్ బ్రదర్ టైటల్ తగ్గట్టు ఫ్యామిలీ యూత్‌కు ఆకట్టుకునేలా ఈ సినిమా కథను డిజైన్ చేసుకున్నాడు. మొదటి సగభాగం ఫ్యామిలీ చుట్టూరా ఈ కథను అల్లుకున్నాడు. ముఖ్యంగా అన్నాతమ్ముళ్ల మధ్య అనుబంధం, వదినా మరిదిల మధ్య ఆప్యాయత, నానమ్మ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను తన సినిమా క్యారీ చేసాడు. అంతేకాదు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లో కామెడీతో పాటు యాక్షన్,  పాటలకు అంతే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ముఖ్యంగా శివ కంఠమనేని యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో ఈజ్ చూపించాడు. ఫైట్ మాస్టర్ రామకృష్ణ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా ఈ సమ్మర్‌లో ఆడియన్స్‌ను ఫుల్ మీల్‌లా అన్ని రకాల ఎమోషన్స్‌ను ఈ సినిమాలో ఉండేలా చేసుకున్నాడు దర్శకుడు.

సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. కాలెజీ అల్లర్లను యూత్ కనెక్ట్ అయ్యేలా ఆయా సన్నివేశాలు సందర్భానికి తగ్గట్టు ఉన్నాయి. ముఖ్యంగా తమ్ముడి ప్రేమను గెలిపించుకోవడం కోసం అన్న చేసే పోరాటం.. తమ్ముడికి కోసం పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయాడనే విషయాన్ని చాలా కన్విన్సింగ్‌గా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాకు సంగీతం పర్వాలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటర్ కూడా బోర్ కొట్టకుండా చాలా గ్రిస్పీగా కట్ చేసాడు. అక్కడ బోర్ కొట్టినా.. ఓవరాల్‌గా బాగుంది.
 

నటీనటుల విషయానికొస్తే..

శివ కంఠమనేని బిగ్ బ్రదర్‌గా టైటిల్ పాత్రలో చక్కగా సరిపోయాడు. ఓ అన్నగా  శివ కారెక్టర్‌లో చూపించాల్సిన ప్రేమ, కోపం ఇలా అన్ని ఎమోషన్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లో మంచి ఎనర్జీతో దుమ్ములేపేశాడు. శివ పాత్ర తరువాత ఈ చిత్రంలో సూర్యలో శ్రీసూర్య చక్కగా ఒదిగిపోయాడు. తన పాత్రలో అన్ని ఎమోషన్స్ చూపించాడు. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.

రేటింగ్ : 2.75/5

Trending News