Tibet Airlines Fire: చైనాలో విమాన ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విమానం!

Tibet Airlines Fire: టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం ఉదయం చైనాలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్ వే పై జారిపడడంతో అందులో మంటలు చెలరేగాయి. విమానంలోని 113 మంది ప్రయాణికులతో పాటు 9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 10:43 AM IST
Tibet Airlines Fire: చైనాలో విమాన ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విమానం!

Tibet Airlines Fire: చైనాలోని చాంగ్‌కింగ్‌ విమానాశ్రయంలో గురువారం టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై జారిపడి మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది, 113 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. అయితే వారందరూ సురక్షితంగా బయటపడ్డారని టిబెట్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరించింది. 

టిబెట్ ఎయిర్ లైన్స్ లో మంటలు చెలరేగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంటలు చెలరేగుతున్న సమయంలో ప్రయాణికులందరూ భయంతో పరుగులు తీస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఏం జరిగిందంటే?

టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం చైనాలోని చాంగ్ కింగ్ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో త్రుటిలో రన్ వే పై విమానం జారిపడింది. దీంతో విమానంలో నుంచి మంటలు చెలరేగాయి. 

అందులో 113 మంది ప్రయాణికులు సహా 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి.. మంటల వ్యాప్తిని చాకచక్యంగా వ్యవహరించి ఆపేశారు. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపనున్నామని సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. 

Also Read: Russia-Ukraine War: రష్యాకు థ్యాంక్స్ చెప్పిన ఉక్రెయిన్, ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు

Also Read: Brain Aneurysm: బ్రెయిన్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్న జిన్‌పింగ్, ఎంతవరకూ ప్రమాదకరమిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News