Varun Sandesh:‘నింద’ తర్వాత మరో పవర్ఫుల్ మూవీ ‘విరాజి’తో పలకరించబోతున్న వరుణ్ సందేశ్..

Varun Sandesh: వరుణ్ సందేశ్.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈయన ఆ తర్వాత వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడ్డాడు. అయినా.. అపుడపుడు కొన్ని డిఫరెంట్ మూవీస్ తో పలకరిస్తున్నాడు. రీసెంట్ గా ‘నిందా’ మూవీతో అలరించిన వరుణ్ సందేశ్.. తాజాగా మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 3, 2024, 10:52 AM IST
Varun Sandesh:‘నింద’ తర్వాత మరో పవర్ఫుల్ మూవీ ‘విరాజి’తో పలకరించబోతున్న వరుణ్ సందేశ్..

Varun Sandesh: రీసెంట్ గా  "నింద" మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. తాజాగా మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.  "విరాజి" టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి  ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష డైరెక్టర్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  సినిమా వరల్డ్ వైడ్ గా ఆగస్టు 2న థియేట్రికల్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ‘విరాజి’ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగానిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ -

విరాజి చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ గారు ఇప్పటిదాకా ఎన్నో మంచి  చిత్రాల్లో నటించారు. హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయనను కొత్త యాంగిల్ లో చూపించే సినిమా ఇది. మూవీ చాలా బాగా వచ్చింది. ఆగస్టు 2న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశామన్నారు.  మేము కొత్త వాళ్లుగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు.

నటి ప్రమోదిని మాట్లాడుతూ -

విరాజి’ ఎంత మంచి పేరో సినిమా కూడా అంతే బాగుంటుందన్నారు. ఈ చిత్రంలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశాను. సినిమా కంప్లీట్ అయ్యింది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్లు ప్రమోషన్ చేసి గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామన్నారు.  

నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ -

మా మూవీకి డైరెక్టర్ హర్ష విరాజి అనే మంచి తెలుగు టైటిల్ పెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో  నేను నటించాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.  

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ -

విరాజి డైరెక్టర్ గా  నా ఫస్ట్ మూవీ. ఇది మా  ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ . విరాజి సినిమా కోసం నేను ఇద్దరు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర. ఆయన కథ విని ప్రొడ్యూసర్ మహేంద్ర దగ్గరకు తీసుకెళ్లారు. మహేంద్ర గారు ఒక ప్రొడ్యూసర్ గానే కాకుండా ఒక టెక్నీషియన్ గా కూడా మా మూవీకి వర్క్ చేశారు. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. మరో ఇంపార్టెంట్ వ్యక్తి వరుణ్ సందేశ్. ఆయన ఎంతో చొరవగా విరాజి మూవీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు.  

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ -
విరాజి స్టోరీ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత  స్టోరీ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల ఊహించాను. సెకండాఫ్ కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుందని హర్ష కు చెప్పాను. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అన్నారు. విరాజి నేను నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామన్నారు.  

సినిమా పేరు: విరాజి

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు...

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమర్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భాను ప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)

Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News