Venkatesh Prasad Calls KL Rahul Brainless: ఐపిఎల్ 2023 లో భాగంగా శనివారం జరిగిన 30వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ బారీ తేడాతో గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ని 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 136 పరుగుల స్వల్ప స్కోర్ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఒకానొక దశలో విజయానికి 30 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండింది. కే.ఎల్. రాహుల్ 45 బంతుల్లో 58 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న ఆ సమయంలో మ్యాచ్ పూర్తిగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలోనే ఉంది. కానీ ఉన్నట్టుండి మ్యాచ్ చివర్లో గుజరాత్ టైటాన్స్ ఎదురుదాడి మొదలుపెట్టింది. ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ గెలుస్తుందనుకున్న మ్యాచ్ ని గుజరాత్ టైటాన్స్ 7 పరుగులు తేడాతో గెలుపొందింది.
లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఆ జట్టు కోచ్ వెంకటేష్ ప్రసాద్ కి పట్టరానంత ఆగ్రహం తెప్పించింది. లక్నో సూపర్ జెయింట్స్ చెత్త ప్రదర్శనపై వెంకటేష్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు బ్యాటింగ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. 9 వికెట్లు చేతిలో ఉన్నప్పుడు 35 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు రన్ ఛేజింగ్‌లో బ్యాటింగ్ ఉండాల్సిన విధంగా లేదని జట్టుపై విరుచుకుపడ్డాడు. హార్దిక్ పాండ్యా కేప్టేన్సీలోని గుజరాత్ టైటాన్స్ తెలివైన ప్రతిభ కనబరిస్తే.. Lko బ్రెయిన్లెస్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కేప్టేన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేయగా వృద్ధిమాన్ సాహా 47 పరుగులు చేశాడు. శుభ్ మన్ గిల్ డకౌట్ కాగా విజయ్ శంకర్ 10 పరుగులు రాబట్టాడు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు . మొత్తానికి గుజరాత్ టైటాన్స్ ని 136 పరుగులకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇది కూడా చదవండి : IPL 2023 Purple Cap: బ్యాట్స్‌మెన్ భరతం పడుతూ.. పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న బౌలర్లు వీళ్లే..
136 పరుగుల స్వల్ప విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్.. మ్యాచ్ ని గెలిచి తీరుతుంది అని అనుకున్నారంతా. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో కే.ఎల్. రాహుల్ 68 పరుగులు చేయగా, కైల్ మేయర్స్ 24 పరుగులు, కృనాల్ పాండ్య 23 పరుగులు మాత్రమే చేశారు. మిగితా ఆటగాళ్లు ఒకటి, రెండు పరుగులతో సరిపెట్టుకోవడంతో ఒకానొక దశలో గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో చివరకు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ కారణంగానే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ తన జట్టు కేప్టేన్ రాహుల్ పై కోపంతో ఊగిపోయాడు.
ఇది కూడా చదవండి : LSG vs GT Updates: అన్నదమ్ముల మధ్య బిగ్‌ఫైట్.. టాస్ గెలిచిన గుజరాత్.. తుది జట్లు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK