/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

విభిన్న రంగాల్లో మనిషి ఎంతగా అభివృద్ధి సాధిస్తున్నా..వైద్యరంగంలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా ఇప్పటికీ అంతబట్టకుండా, చికిత్సకు అందకుండా ఉన్నది కేన్సర్ ఒక్కటే. రోజురోజుకూ కేన్సర్ మహమ్మారి విశృంఖలంగా వ్యాపిస్తోంది. ప్రాణాంతక వ్యాధి కావడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. 

వైద్యరంగంలో ఇప్పటికీ చికిత్స లేని వ్యాధి కేన్సర్ ఒక్కటే. సకాలంలో గుర్తిస్తే నియంత్రించడం ద్వారా జీవన పరిమాణాన్ని పెంచుకోవచ్చు. సకాలంలో గుర్తించలేకపోతే ప్రాణాలు పోతాయి. కేన్సర్‌ను సకాలంలో గుర్తించగలిగితే కొన్ని సంకేతాలు ముందుగానే వెలువడతాయి గానీ వాటిని గుర్తించగలగాలి. చిన్న చిన్న లక్షణాలు కూడా కేన్సర్ సంకేతాలు కావచ్చంటారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ ముప్పు పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరికీ ఆ పదం వింటే భయమేస్తుంటుంది. ప్రపంచ మరణాల్లో అధిక శాతం కేన్సర్ కారణం కావడం గమనార్హం. కేన్సర్ ప్రారంభదశలో చాలా రకాల సంకేతాలు ఇస్తుంది. ఈ లక్షణాల్ని పట్టించుకోకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. 

కేన్సర్ ప్రారంభ లక్షణాలు

శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుండటం మంచి పరిణామం కాదు. లోపలున్న కేన్సర్ ఇతర భాగాలకు విస్తరిస్తుందనేందుకు ఇది సంకేతం అవుతుంది. ట్యూమర్ సమీపంలోని టిష్యూని ఆక్రమించినప్పుడు శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. వైద్య పరిభాషలో పైరోక్సియాగా పిలుస్తారు. పైరోక్సియా అనేది కేన్సర్ రోగుల్లోనే ఉంటుంది. కేన్సర్ విస్తరిస్తుందనేందుకు లేదా తదుపరి దశలో ఉందనేందుకు సంకేతమిది. యూకేకు చెందిన కేన్సర్ రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 

కచ్చితంగా ఇది ఆందోళన కల్గించే అంశం. పైరోక్సియా అన్ని రకాల కేన్సర్‌లలో ఉండే ఓ సాధారణ లక్షణం. ఈ లక్షణం బ్లడ్ కేన్సర్ వంటి లుకేమియా, లింఫోమియాలో ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ కేన్సర్, లంగ్స్ కేన్సర్, బౌల్ కేన్సర్ ఉన్నప్పుడు జ్వరం ఉండే అవకాశాలు తక్కువే. అయితే కేన్సర్ రీసెర్చ్ ప్రకారం జ్వరం కూడా రావచ్చు. ఒకవేళ వారిలోని ట్యూమర్..లివర్ వరకూ విస్తరిస్తే జ్వరం వస్తుంటుంది. శరీరంలో ఎక్కడో చోట కేన్సర్ ఆటంకం కల్గిస్తుందని అర్ధం.

తరచూ జ్వరం రావడం సంకేతమా

అన్ని రకాల కేన్సర్‌లో జ్వరం రావాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల కేన్సర్‌లతో పోలిస్తే అధిక జ్వరం ఎందుకు వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కొన్ని వ్యాధులు టాక్సిన్స్ ఉత్పత్తి చేయడం వల్ల జ్వరం వస్తుందంటారు. కేన్సర్ జ్వరంలో పైరోజెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. పైరోజెన్ అనేది జ్వరాన్నిప్రేరేపించే పదార్ధం. 

అందుకే తరచూ జ్వరం వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. సంక్రమణ లేదా జ్వరానికి తక్షణ చికిత్స అనేది భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే తీవ్రమైన సమస్యల్ని నియంత్రించవచ్చు. అలసట, ఆకస్మికంగా బరువు తగ్గడం, బలహీనత, కురుపులు,సెగ్గెడ్డలు, ఛాతీలో మంట, కడుపులో నొప్పి కేన్సర్ రోగుల్లో కన్పించే ప్రధాన లక్షణాలు. 

Also read: Skin Care Tips: నలభైలో సైతం ఇరవైలా కన్పించే అద్భుతమైన ఐదు పదార్ధాలివే, నెలరోజుల్లోనే ఫలితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Precautions and tips to detect cancer in early stages, know these symptoms and signs of cancer, how to detect it
News Source: 
Home Title: 

Cancer Signs: కేన్సర్‌ను సకాలంలో ఎలా గుర్తించడం, ఎందుకు ప్రాణాంతకమౌతుంది

Cancer Signs: కేన్సర్‌ను సకాలంలో ఎలా గుర్తించడం, ఎందుకు ప్రాణాంతకమౌతుంది
Caption: 
Cancer Signs ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Cancer Signs: కేన్సర్‌ను సకాలంలో ఎలా గుర్తించడం, ఎందుకు ప్రాణాంతకమౌతుంది
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, May 2, 2023 - 17:50
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
87
Is Breaking News: 
No
Word Count: 
323