Divyabharathi Tollywood Entry: సుడిగాలి సుధీర్ కోసం తమిళ భామ.. ఏకంగా దివ్యభారతిని దింపుతున్నారుగా!

Divyabharathi Debut in Telugu: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా మారిన సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్గా ఎంపికైనట్లు ప్రకటించారు.   

Written by - Chaganti Bhargav | Last Updated : May 11, 2023, 11:28 PM IST
Divyabharathi Tollywood Entry: సుడిగాలి సుధీర్ కోసం తమిళ భామ.. ఏకంగా దివ్యభారతిని దింపుతున్నారుగా!

Divyabharathi Debut in Telugu: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలని నటింప చేయడం కంటే బయట నుంచి వస్తున్న తమిళ, మలయాళ, కన్నడ భామలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం ఈ మధ్య పరిశీలిస్తుంటే కనుక ఎక్కువగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారు అదేవిధంగా మలయాళ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లను మన దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆదరిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్గా క్రేజ్ అందుకుంటున్న రష్మిక మందన, పూజా హెగ్డే, శ్రీ లీల వంటి వారు కన్నడ ప్రాంతానికి చెందిన వారే మరోపక్క సంయుక్త మీనన్ వంటి వారు మలయాళ ప్రాంతానికి చెందిన వారు. ఇప్పుడు ఆసక్తికరంగా మరొక తమిళ హీరోయిన్ ని తెలుగులో హీరోయిన్గా లాంచ్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు ఈ మధ్యకాలంలో తమిళ్లో యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించిన దివ్యభారతి. దివ్యభారతి అంటే అప్పుడెప్పుడో చనిపోయిన దివంగత నటి అనుకోకండి. ఈమె ఈ మధ్యనే సినీ రంగ ప్రవేశం చేసిన కొత్త దివ్యభారతి.

Also Read: Janhvi Kapoor Telugu Films: మరో రెండు తెలుగు సినిమాలలో జాన్వీ కపూర్.. ఫ్లాఫ్ హీరోకు జతగా!

మిళంలో 2021 సంవత్సరంలో బ్యాచిలర్ సినిమాతో ఈమె ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి అంతకుముందే ఒక సినిమా చేసింది కానీ ఆ సినిమాకి రాని క్రేజ్ బ్యాచిలర్ సినిమాకి వచ్చింది. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా దివ్యభారతి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ అలరించింది. ఆ సినిమా హిట్ అయినా సరే ఆమెకు అవకాశాలైతే దక్కలేదు.

2023లోనే ఆమె నటించిన జర్నీ సినిమా కూడా విడుదలైంది కానీ ఆ సినిమాకి కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక ఈ మధ్య ఈ భామ సోషల్ మీడియాలో చేస్తున్న హాట్ షో అయితే చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఈ భామ తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకుని తర్వాత హీరోగా కూడా మారిన సుడిగాలి సుధీర్ సరసన ఆమె హీరోయిన్గా ఎంపికైంది. సుధీర్ అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించారు కానీ సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో ఆయన హీరోగా మారాడు. ఆ తరువాత త్రీ మంకీస్ అనే సినిమాలో కూడా నటించాడు. కానీ ఆ సినిమా అయితే ఆయనకు కలిసి రాలేదు. ఇక సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా మాత్రం అతనికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు సుడిగాలి సుదీర్ పాగల్ సినిమా దర్శకుడు నరేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా ఎంపికైనట్లు తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

Also Read: Shalini Pandey Photos: రచ్చ లేపిన షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్‌ ట్రీట్ చూస్తే ఫ్యూజులు అవుట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News