Gajakesari Yog: మరో 48 గంటల తర్వాత ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?

Benefits of Gajakesari Yog: మరో రెండు రోజుల్లో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజకేసరి రాజయోగం వల్ల కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 15, 2023, 03:24 PM IST
Gajakesari Yog: మరో 48 గంటల తర్వాత ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. మీరున్నారా?

Jupiter and Moon Conjunction 2023 in Ares: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చి ఇతర గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే గ్రహాల కలయిక వల్ల శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇలాంటి యోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. 

జాతకంలో చంద్రుని నుండి కేంద్ర గృహంలో (మొదటి, నాల్గవ, సప్తమ మరియు పదవ ఇల్లు) బృహస్పతి ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. మే 17 రాత్రి 7.39 గంటలకు చంద్రుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ రాశిలో మే 19 వరకు ఉంటాడు. ఇప్పటికే మేషరాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

మిధునరాశి
గజకేసరి రాజయోగం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు సమాజంలో గౌరవంతోపాటు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
తులారాశి
గజకేసరి యోగం తుల రాశి వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీరు ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అనుకున్న సమాయనికి పనులన్నీ పూర్తవుతాయి. 
మేషరాశి
ఈ రాశిలోనే బృహస్పతి మరియు చంద్రుల కలయిక ఏర్పడనుంది. దీని కారణంగా ఏర్పడిన గజకేసరి రాజయోగం మీకు ఊహించని ధనాన్ని ఇస్తుంది. ఆగిపోయిన పనులు మళ్లీ మెుదలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 

Also read: Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశుల జాతకం మారిపోనుంది.. మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News