Heat Waves: ఎండలు మండిపోతున్నాయి. రోహిణి కార్తె రాకుండానే రోళ్లు పగిలే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. కోస్తాంధ్రలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రాజమండ్రిలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు
మండుతున్న ఎండలతో రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. మొన్నటి నుంచి ఏపీలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం నుంచి ఏపీలో, మరీ ముఖ్యంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. తీవ్రమైన వడగాల్పులు భయపెడుతున్నాయి. బయటకు ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా 40 డిగ్రీలు దాటితేనే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది రెండు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న అంటే సోమవారం నాడు అత్యదికంగా 45 నుంచి 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో సోమవారం నాడు అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు కాగా, ఏలూరులో 46 డిగ్రీలు నమోదైంది. ఇక రాజమండ్రిలో నిన్న అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గమనార్హం. దీనికి తోడు భయం గొలిపే వడగాల్పులు బెంబేలెత్తించాయి.
రాజమండ్రిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత
ఇక రాజమండ్రిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న నమోదైన 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం అనుకుంటే ఇవాళ అంటే మంగళవారం పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరులో గరిష్టంగా 48 డిగ్రీలు, కొత్తగూడెంలో 47 డిగ్రీలు నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. ఈ పరిస్థితి మరో మూడ్రోజులు ఇలాగే కొనసాగుతుందని తీవ్రమైన ఎండలు, వడగాల్పులు ఉంటాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఎండల తీవ్రత, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పగలు బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. అత్యవరైతే తప్ప శరీరం నిండుగా కప్పుకుని వెళ్లాలంటున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిమ్మరసం, మజ్జిగ, బార్లి, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, దోసకాయ ఎక్కువగా సేవించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heat Waves: భీకరమైన ఎండలు, రాజమండ్రిలో రికార్డు స్థాయిలో 49 డిగ్రీలు